టి 20 ప్రపంచ చాంపియన్ గా వెస్టిండీస్
Publish Date:Oct 8, 2012
Advertisement
వెస్టిండీస్ సుదీర్ఘ విరామం తర్వాత విశ్వవిజేతగా నిలిచింది. పొట్టి క్రికెట్ సమరంలో చాంపియన్‌గా అవతరించింది. టి-20 ప్రపంచ కప్ ఫైనల్లో కరీబియన్లు 36 పరుగులతో ఆతిథ్య శ్రీలంకను ఓడించి కప్‌ను ఎగరేసుకుపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహేల సేన 18.4 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. మహేల 33, సంగక్కర 22, కులశేఖర 26 పరుగుల మినహా ఇతర బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ దాటలేకపోయా రు. విండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ లంక పతనాన్ని శాసించారు. సునీల్ నరైన్ 3/9, సామీ 2/6 అద్భుతంగా బౌలింగ్ చేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 137 పరుగులు చేసింది. శామ్యూల్స్ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో సామీ 15 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు దూకుడుగా ఆడగా, డ్వెన్ బ్రావో 19 పరుగులు చేశాడు. కాగా ఇతర బ్యాట్స్‌మెన్ దా రుణంగా విఫలమయ్యారు. లంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ 4/12 మరోసారి అద్భుతంగా రాణించాడు. మాథ్యూస్ 1/11, అఖిల ధనంజయ 1/16 పొదుపుగా బౌలింగ్ చేయగా, స్టార్ పేసర్ మలింగ 0/54 ధారాళంగా పరుగులిచ్చేశాడు. శామ్యూల్స్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', ఆసీస్ ఆల్‌రౌండర్ వాట్సన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి.
http://www.teluguone.com/news/content/west-indies-wins-t20-world-cup-31-17962.html





