ఇది ప్రకృతి విపత్తు మేమేం చేయలేం.. అంబటి

Publish Date:Jul 19, 2022

Advertisement

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వ పెద్దలైనా ఏం చేయాలి? కాలికి బలపం కట్టుకుని మరీ బాధిత ప్రాంతాల్లో తిరగాలి. బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు సరిగా జరిగేలా చూడాలి. గతంలో విశాఖపట్నంలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు అలాగే చేశారు.

ప్రత్యేక బస్సులో విశాఖ వెళ్లి, సహాయ కార్యక్రమాలు సజావుగా జరిగేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. బస్సులోనే  బస చేసి మరీ రేయంబవళ్లు   బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూశారు. తుపాను ధాటికి ధ్వంసమైపోయిన సుందర విశాఖ నగరాన్ని కొద్ది రోజుల వ్యవధిలోనే యథా పూర్వస్థితికి వచ్చేలా చేశారు. అంతకు ముందు కూడా పలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఈ విధంగానే స్పందించాయి.

అయితే.. తాజాగా ఏపీలో     గోదావరికి  భారీ వరదలు వచ్చాయి. ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి  జనం సురక్షిత ప్రాంతాలకు, సహాయక శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ఇంతలా గోదావరి నది విరుచుకు పడితే.. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మాత్రం  ‘ఇది ప్రకృతి విలయం. మనమేం చేయలేం’ అంటూ చేతులెత్తేశారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలోనే చెప్పి తన చాతకాని తనాన్ని చాటుకున్నారు.

జులై నెలలో గోదావరి నదికి భారీ వరదలు రావడం అరుదన్నారు. సాధారణంగా జులై నెలాఖరులోనో, ఆగస్టులోనో వరదలు వస్తాయి. కానీ ఇంత భారీ స్థాయిలో వరదలు జులై నెల మధ్యలోనే రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇంతలా వరదలు విరుచుకుపడతాయని అస్సలు ఊహించలేదని ఆయన చెప్పారు. జనం దీనినే తప్పుపుడుతున్నారు.  వరదలు ముంచుకొస్తాయని ముందే హెచ్చరించాల్సిన వాతావరణ విభాగం పనిచేయలేదా? ముసుగుదన్ని పడుకుందా? అని నిలదీస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని వందలాది లంక గ్రామాలు వరదనీటిలో మునిగిపోయి బాధితులు అల్లాడిపోతుంటే.. స్పందించి సహాయం అందించాల్సిన ప్రభుత్వం  మొద్దు నిద్రపోతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

 బాధితులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, సహాయక శిబిరాల్లో ఆహారం, పాలు, తాగునీరు లాంటి సౌకర్యాల కల్పించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకొల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పలు లంక గ్రామాల్లో గుండె లోతు నీటిలో నడిచి వెళ్లి మరీ బాధితులకు సహాయం అందించారు. లంక గ్రామాల్లోనే రాత్రిళ్లు బస చేసి మరీ వారికి అండగా నిలిచారు. అయితే అధికార వైసీపీ నేతలు  ఎవరూ వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పలకరించిన వైనం, పరామర్శించిన దాఖలాలు లేవంటున్నారు. పైగా అంబటి తీరిగ్గా విజయవాడలో మీడియా సమావేశం పెట్టి మరీ ‘మనమే చేయలేం’ అనడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

ఒక పక్కన వరద విలయ తాండవం చేస్తుంటే.. బాధితులను ఆదుకోకపోగా.. ఈ సందర్భాన్ని కూడా రాజకీయం చేయడానికి మంత్రి అంబటి ప్రయత్నించడాన్ని తప్పుపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు ఏకమై వచ్చినా ఒంటరిగానే ఎదుర్కొనగల ప్రజాదరణ గల నేత జగన్ అని చెప్పుకున్నారు. వరదలు, జనం బాధలు, నష్టం గురించి పట్టించుకోని మంత్రి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రభుత్వమే అని నింద వేస్తుండడం ఏంటని అంటున్నారు.

కాఫర్ డ్యామ్ కట్టకపోయినా ఫర్వాలేదని ఇంజనీర్లు చెబుతున్నారంటూనే.. అనుకున్న సమయానికి దిగువ కాఫర్ డ్యామ్ ను పూర్తిచేయలేకపోయామని తప్పు ఒప్పుకోవడం గమనార్హం. వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న బాధితులను స్వయంగా పరామర్శించకుండా గాల్లోనే తిరిగి గాల్లోనే తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయిన జగన్ ఎక్కడ? హుద్ హుద్ తుపాను బీభత్సం సమయంలో విశాఖలోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలను పరుగులు పెట్టించిన చంద్రబాబు ఎక్కడ? అంటూ జనం చెప్పుకుంటున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.