వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపై స్పెషల్ స్టోరీ

Publish Date:Jun 21, 2025

Advertisement

 

 వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి. గురువారం రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానంలో నిర్వహించిన రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. కొండ సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు విశ్వ ప్రచారం చేస్తున్నారని అవేవీ నమ్మకూడదని పదవి ఎక్కడికి పోదు అని మా వెనకాల రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


 పరకాల నియోజకవర్గంలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడని ఎన్నికలప్పుడు వచ్చి ఒకసారి గెలిపించాలని  కాలు పట్టుకున్నాడని మళ్లీ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని వదిలేస్తానని మాట ఇచ్చాడని గుర్తు చేశారు.. పరకాల నియోజకవర్గం నుంచి త్వరలోనే తన కూతురు కొండ సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశం చేస్తారని అన్నారు. మరో సొంత పార్టీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో గెలిచి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.. ఆయన కనుబొమ్మలు గీసుకుంటాడని ఎన్కౌంటర్లో స్పెషలిస్ట్ అని అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ కేటీఆర్‌ను  వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని,అతనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. 

కొండమురళి లెక్క మీకు ఇజ్జతి మానవత్వం  ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాలు విసిరారు.. మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. వరంగల్ జిల్లాలో మొదటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొండ మురళి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేది.. ఒకరికొకరు మీడియా సమావేశంలో కూడా తిట్టుకునేవారు.. కొండ మురళి కుటుంబ సభ్యులంతా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఆ విధంగా ఆది నుంచి ఇప్పటివరకు వీధి మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేయకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవుల ప్రకాష్ రెడ్డి లపై మాజీ ఎమ్మెల్సీ కొండమురళి ఈ విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంతో కొండ మురళి టార్గెట్ మారిందా అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


 గత కొద్ది రోజుల నుండి మంత్రి కొండా సురేఖ పదవి పోతుందని మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది.. అప్పటినుండి మంత్రి కొండ సురేఖ పైన సోషల్ మీడియాలో పలు సంఘటనలు సంబంధించి ప్రచారం చేయడంతో పాటు అది కొద్ది రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది..మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గన్మెన్లను తొలగించడంతోపాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కి ఎస్కార్ట్ గా వచ్చిన ఏసిపి సీఐలకు మెమోలు జారీ చేసిన ఘటనలు చూస్తుంటే ఏం జరుగుతుందోనని ఆశ్చర్యంనికి గురిచేస్తుంది.. వీటన్నిటిని గమనించిన కొండ మురళి ఈ విధంగా మాట్లాడారని కొండ మురళి అనుచరులు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు.. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొండ సురేఖ పదవి తప్పించేందుకు టిడిపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర లాబింగ్ చేస్తున్నారని వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం అందుకుంది

 వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ పై కూడా కొండ మురళి హాట్ కామెంట్ చేశారు... తనకు ఎస్కార్ట్ గా వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కోవర్టుల పైన పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. వరంగల్ తూర్పులో తను ఉన్నంతకాలం రెండో లీడరు రాలేడు అని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యను కూడా ఉద్దేశించి మాట్లాడారు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే కక్షగట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కగార్ ఆపరేషన్ ను ఆపేయాలని అంటే పోలీసులు అడ్డుకున్నా రన్నారు. ఇప్పుడు జిల్లాకు చెందిన బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయ్యారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజల్లో ఉంటానని ప్రజలకు సేవ చేయడమే మా కుటుంబం లక్ష్యమని ధైర్యంలో తాను పెద్దపులిని అంటూ మాట్లాడారు..మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.