Publish Date:Apr 12, 2024
బీఆర్ఎస్ లో వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థుల కరవు తీవ్రంగా కనిపిస్తోంది. ఎంతగా డిమాండ్ వస్తున్నా కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు సుముఖంగా లేరని తేలిపోయింది. ఆ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారు కూడా పోటీకి నిరాకరించి పక్క పార్టీల్లోకి జంప్ కొట్టేస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో కేసీఆర్ అభ్యర్థుల కోసం వేట మొదలెట్టారు. అందులో భాగంగానే మాజీ మంత్రి, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందుగా పార్టీతో విభేదించి, అభ్యర్థుల ఎంపికలో పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రాజయ్యను కేసీఆర్ మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ లోక్ సభ స్థానం ఆఫర్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శుక్రవారం (ఏప్రిల్ 12) కేసీఆర్ పిలుపు మేరకు తాటికొండ రాజయ్య హుటాహుటిన కేసీఆర్ ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తెకు కేసీఆర్ వరంగల్ బీఆర్ఎస్ సీటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పోటీకి నిరాకరించి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో కంగుతిన్న కేసీఆర్ చూపు రాజయ్యపై పడింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కడియం శ్రీహరితో విభేధించి, ఆయనకు కేసీఆర్ స్టేషన్ ఘనపూర్ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి కుమార్తె హాండివ్వడంతో కేసీఆర్ రాజయ్యను ఆ స్థానంలో పార్టీ అభ్యర్థిగా నిలిపేందుకు నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. రాజయ్య కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలివ్వడంతో కేసీఆర్ ఆయనను ఫామ్ హౌస్ కు ఆహ్వానించారు. ఇప్పుడో ఇహనో కేసీఆర్ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య పేరును ప్రకటించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/warangal-brs-candidate-tadikonda-rajayya-25-173652.html
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.