కాదు కాదంటూనే ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన!

Publish Date:Mar 23, 2026

Advertisement

ఇరాన్ తో జరుగుతున్నయుద్ధంపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇది దాదాపు యుద్ధ విరమణ ప్రకటనలాగే ఉంది. ఇరాన్ పై యుద్ధంలో తమ లక్ష్యాలు దాదాపు నెరవేరినందున ఇరాన్ పై దాడుల తీవ్రతను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది యుద్ధ విరమణగా భావించవద్దని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. కాల్పుల విరమణ కాదని స్పష్టం చేసినప్పటికీ ప్రపంచ దేశాలలో, యుద్ధ నిపుణులలో మాత్రం ట్రంప్ వెనకడుగు వేశారన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది.  ఇరాన్ ఇప్పుడు పూర్తిగా కుప్పకూలుతోందనీ, ఈ పరిస్థితుల్లో యుద్ధ విరమణ ఉండదనీ ట్రంప్ పేర్కొన్నారు.  అయితే ఇరాన్ అమెరికా దాడులను ప్రతిఘటిస్తున్న తీరు చూస్తుంటే.. ట్రంప్ ప్రకటన  మేకపోతు గాంభీర్యం అన్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడం, మిత్రదేశాల రక్షణ వంటి అమెరికా ప్రధాన లక్ష్యాలు దాదాపుగా నెరవేరడం వల్లనే దాడుల తీవ్రతను తగ్గిస్తున్నామని ట్రంప్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే హర్మూజ్ జలసంధి విషయంలో ట్రంప్ హెచ్చరికను ఖాతరు చేయబోమని ఇరాన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ట్రంప్ యుద్ధ ముగింపు ప్రకటన చేయడంతో అమెరికా వెనకడుగు వేసిందన్న అభిప్రయామే కలుగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.  

By
en-us Political News

  
చంద్రబాబు పక్కనే నిలబడి విధులు నిర్వహిస్తున్న ఒక ఎన్ఎస్‌జీ కమాండోకు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. అప్రమత్తమైన ఇతర సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93, కూపర్ కానొలీ 46 బంతుల్లో 87 పరుగులు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. వీరి మెరపు బ్యాటింగ్ తో పంజాబ్ ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.
తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వికారాబాద్ జిల్లాలో డ్రోన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం దిశగా సాగుతున్న సమయంలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది.
వైద్య వృత్తిని కేవలం వృత్తిగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా భావించే వ్యక్తులు అరుదుగా ఉంటారు.
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు మంచి ఉద్యోగం, మరోవైపు సమాజం నుంచి వచ్చే విమర్శలు.. ఇవన్నీ దాటుకుని తన కలల దిశగా అడుగులు వేయడం సాధారణమైన విషయం కాదు
ఐపీఎల్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరో రికార్డును బ్రేక్ చేశాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్జరీకి అపోలో ఆస్పత్రిలో ఎంత బిల్ అయ్యింది? దాన్ని ఎవరు చెల్లించారు? చర్చ ఒకటి నడుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి
సీఎం చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.