ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. బొత్సకు రాజకీయ సమాధా?

Publish Date:Aug 6, 2024

Advertisement

సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిపోనుందా? వైసీపీ అధినేత జగన్ నిర్ణయమే బొత్స రాజకీయ జీవితానికి సమాధి కట్టేయనుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బొత్త సత్యనారాయణ ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు, తనకే కాకుండా తన కుటుంబ సభ్యులను  కూడా ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర ఆయనది. అయితే 2014 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత బొత్స సత్యనారాయ సైలెంటైపోయారు. పెద్దగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా ఓ విధంగా అజ్ణాత వాసం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ చేయందుకోనున్నారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. 
ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ హస్తినలో ధర్నా కార్యక్రమం చేపట్టిన సందర్భంగా బొత్స కూడా జగన్ వెంట హస్తిన వెళ్లారు. అయితే జగన్ బొత్సను వెంట తీసుకురావడానికి కారణం ధర్నా కాదని పరిశీలకులు విశ్లేషిస్తారు. జగన్ కు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లేందుకు ఆ పార్టీతో తనకున్న పాత పరిచయాలను ఉపయోగించుకోవడం కోసమేనని వైసీపీ శ్రేణులే అప్పట్లో చెప్పారు. సరే అసలు విషయానికి వస్త... జగన్ ఇప్పుడు బొత్స సత్యనారాయణకు ఓ పెద్ద టాస్క్ ఇచ్చారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బొత్సను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు.  
అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ బొత్సకు సుతరామూ ఇష్టం లేదు. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీకి ఈ ఉప ఎన్నికలో విజయం సాధించే అవకాశాలు అంతంత మాత్రమే. ఉప ఎన్నికలో ఫలితం తేడాగా వస్తే అక్కడితో బొత్స పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లే అంటారు. ఇప్పటికే బొత్స తనతో సహా తన కుటుంబ సభ్యులు ఐదుగురికి ఫ్యామిలీ ప్యాకేజీ చందంగా ఇటీవలి ఎన్నికలలో వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఎన్నికలలో ఆయన సహా ఆయన కుటుంబ సభ్యులందరూ పరాజయం పాలయ్యారు. ఇటీవలి ఎన్నికలలో బొత్స కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేశారు. బొత్స స్వయంగా చీపురుపల్లి నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. బొత్స సతీమణి విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  ఇక బొత్స సోదరుడు అప్పలనరసయ్య గజపతి నగరం నుంచి, ఆయన తోడల్లుడు బి.అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి,  బొత్స సత్యనారాయణ సమీప బంధువు బెల్లెన చంద్రశేఖర్ విజయనగరం లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ తరుణంలో ఆయనను జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో దింపారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీపై అనర్హత వేటు పడి ఆ స్థానం ఖాళీ అవ్వడమే కారణం. అదలా ఉంటే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలో మొత్తం841 మంది ఓటర్లు ఉంటే వారిలో 615 మంది వైసీపీకి చెందిన వారే. తెలుగుదేశం పార్టీకి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 2020లో జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎన్నికను అప్పట్లో తెలుగుదేశం బహిష్కరించింది.  అయితే పార్టీ నేతలు, అభిమానులు పోటీలో నిలిచి పలు స్థానాలలో విజయం సాధించారు. కాగా గణాంకాలను బట్టి చూస్తే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఏ విధంగా చూసినా బొత్స విజయం తథ్యం అని జగన్ చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇటీవలి  ఎన్నికలలో వైసీపీ ఘోరంగా  ఓడిపోయింది. విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా విజయం సాధించలేదు. ఆ స్థాయి పరాజయం తరువాత వైసీపీ స్థానిక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. అంతే కాకుండా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం బాధ్యతను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అప్పగించింది. ఎలక్షన్ మేనేజ్ మెంట్ స్కిల్స్ అపారంగా ఉన్న సీఎం రమేష్ వెంటనే రంగంలోకి దిగారు. దీంతో పోటీ బొత్స వర్సెస్ సీఎం రమేష్ గా మారిపోయింది. వైసీపీకి చెందిన పలువురు స్థానిక సంస్ఖల ప్రతినిథులు తెలుగుదేశం గూటికి చేరారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో బొత్స పరాజయం పాలైతే  ఆయన రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.