వినేశ్ ఫోగట్ కు హర్యానా సర్కార్ అండ!
Publish Date:Aug 8, 2024
Advertisement
భారత్ ఏస్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కు చేరి కూడా వంద గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన సంగతి తెలిసిందే. దేశం యావత్తూ ఫోగట్ కు మద్దతుగా నిలిచింది. ఆమెపై అనర్హత వేటు అన్యాయమని ఎలుగెత్తింది. దీని వెనుక కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలను సైతం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా వినేశ్ ఫోగట్ అద్భుత ప్రదర్శన తరువాత కూడా పతకం లేకుండా రిక్త హస్తాలతో భారత్ కు తిరిగి రావలసిన పరిస్థితి వచ్చింది. అటువంటి వినేశ్ ఫోగట్ కు హర్యానా ప్రభుత్వం అండగా నిలిచింది. పతకం సాధించకపోయినా ఆమెకు రజత పతక విజేతకు దక్కే అన్ని సన్మానాలూ, సత్కారాలు, సౌకర్యాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. వినేశ్ చాంపియన్ అని పేర్కొన్నారు. "అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ వరకు వెళ్లింది. ఫోగట్ ఫైనల్ ఆడకపోవచ్చు కానీ ఆమె ఛాంపియనే. అని పేర్కొన్నారు. ఒలింపిక్ మెడల్ సాధించిన క్రీడాకారిణిలాగే ఆమెకు హర్యానా ప్రభుత్వం స్వాగతం పలకుతుంది. ఒలింపిక్ రజత పతక విజేతకు దక్కే అన్ని సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలను వినేశ్ ఫోగట్ కు అందజేస్తుంది.
http://www.teluguone.com/news/content/vinesh-phogat-recieve-welcome-as-olympic-medalist-25-182511.html





