షేర్ హోల్డర్ లను నట్టేట ముంచిన ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్

Publish Date:Feb 14, 2012

Advertisement

కో ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ పై విచారణ జరుపుతున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు
విజయవాడ: విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రారంభించిన ల్యాంకో గ్రూప్ వేలాది మంది షేర్ హోల్డర్ లను నట్టేట ముంచింది. ఈ గ్రూప్ లోని ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని షేర్ల రూపంలో సేకరించింది. దేశంలో ఇన్ ఫ్రాటెక్  రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని షేర్ హోల్డర్ లను నమ్మబలికింది. లాభాలు వస్తాయనే ఆశతో అనేక మంది ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. అయితే కంపెనీ యాజమాన్యం అత్యాశ, అనైతిక కార్యకలాపాల వల్ల షేర్ హోల్డర్ లు అపారంగా నష్టపోయిన వైనం ఇది.
   

వివరాల్లోకి వెళితే... లగడపాటి అమరప్పనాయుడు అండ్ కంపెనీ (ల్యాంకో ) ను 25 సంవత్సరాల క్రితం రాజగోపాల్ ప్రారంభించారు.మొదట ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్ గా, తర్వాత తెలుగుగంగ పనుల సబ్ కాంట్రాక్టర్ గా వ్యాపార జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్ తర్వాత సిమెంట్, కాస్టింగ్స్ ఐ.టి., ఇన్ ఫ్రా, కొండపల్లి పవర్ యూనిట్లను నెలకొల్పారు. అప్పట్లో వీటిలో ఒక్క కొండపల్లి పవర్ మాత్రమే లాభాలను ఆర్జించగా మిగిలిన యూనిట్లన్ని నష్టాలపాలయ్యాయి. ఈ నేపధ్యంలో రాజగోపాల్ అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉపేంద్రకు అల్లుడయ్యాడు. ఉపేంద్ర ద్వారా చంద్రబాబుకు సన్నిహితుడై ల్యాంకో కొండపల్లికి అనేక రాయితీలు పొందాడు. విద్యుత్ కేంద్రం పని చేసినా పని చేయకపోయినా కొంత స్థిర వ్యయాన్ని దానికి రాష్ట్ర పభుత్వం చెల్లించాలన్న రాయితీ ముఖ్యమైంది. ఈ రాయితీ ద్వారా రాజగోపాల్ సుమారు 700 కోట రూపాయల మేరకు  లబ్ధిపొందారు.


రాజగోపాల్ 2004 లో కాంగ్రెస్ పార్టీ ఎం.పి.గా ఎన్నికయ్యేనాటికి అతని పారిశ్రామిక సంస్థల టర్నోవర్ సుమారు 1000 కోట్లు. అది ప్రస్తుతం 16వేల కోట్లకు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం రాజగోపాల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ తన పలుకుబడిని పూర్తిగా తన సంస్థల అభివృద్ధికి కేటాయించడమే. ఈ ఎనిమిదేళ్ళలో ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని 16రెట్లు విస్తరించుకున్నాడు గాని విజయవాడ అభివృద్ధికి చేసింది శూన్యం.


వ్యాపారాభివృద్ధిలో భాగంగా ఆయన తనకు అత్యంత సన్నిహితుడైన యార్లగడ్డ హరీష్  చంద్రప్రసాద్ వంటి వారికి కూడాహ్యాండ్ ఇచ్చారనే అపవాదుమూటగట్టుకున్నారు. రాజగోపాల్ పార్లమెంట్ సభ్యుడైన తర్వాత కంపెనీ పగ్గాలను తన సోదరుడు  మధుసూదన్ కు అప్పగించారు. అన్నకన్నా రెండాకులు ఎక్కువ చదివిన మధుసూధన్ గ్రూప్ ను విస్తరించాలనే తాపత్రయంతో అనేక తప్పులు చేశారు. వెనకాముందు ఆలోచించకుండా భారత ప్రజల నుంచి సేకరించిన ధనంతో ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు కొనుగోలు చేశారు. అక్కడ కూడా ఎత్తులు జిత్తులు వేయాలని చూసి చేతులు కాల్చుకున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని బొగ్గుగనులను గ్రిఫిన్ కోల్ అనే ప్రైవేట్ సంస్థనుంచి ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ 2011  జూన్ లో కొనుగోలు చేసింది. అయితే అప్పటికి రెండు సంవత్సరాల ముందే గ్రిఫిన్ కోల్ బొగ్గు సరఫరా ఒప్పందాలను పర్దిమాన్ యూరియా, బ్లూవాటర్ పవర్ స్టేషన్ లతో చేసుకుంది. ఈ పాత ఒప్పందాలను గౌరవిస్తాయనే హామీతో గ్రిఫిన్ కోల్ ను ల్యాంకో కొనుగోలు చేసింది. కొన్న వెంటనే ల్యాంకో వైఖరిలో మార్పు వచ్చింది. అప్పటి ఒప్పందాలను తాము గౌరవించమని అధిక రేటు చెల్లిస్తేనే తిరిగి అ రెండు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని పేచి పెట్టింది. దీనికి ప్రధాన కారణం బొగ్గును అక్కడి ఈ రెండు సంస్థలకు విక్రయించేకన్నా దానిని మన దేశంలోని తన ప్లాంట్లకు ఉపయోగించుకుంటే  ఎన్నోరెట్ల లాభం వస్తుందనే దురాశ. అలాకాక ఇండియాలో అ బొగ్గును విక్రయిస్తే టన్నుకు 30 డాలర్ల వరకూ లాభం వస్తుంది. లాభాల దురాశతో ల్యాంకో అనైతిక కార్యకలాపాలకు పూనుకుంది.

లాంకో దురాశను పసిగట్టిన పర్దిమాన్ యూరియా కంపెనీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టులో 17వేల కోట్ల నష్టపరిహారం కోరుతూ కేసు పెట్టింది. ఈ కేసులో ప్రాధమిక సాక్ష్యాదారాలు ఉండడంతో సుప్రీంకోర్టు ల్యాంకో యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. మొదట ల్యాంకో పర్దిమాన్ పై బెదిరింపులకు దిగింది. నష్టపరిహార దావాను ఉపసంహరించుకోకపోతే తాము కూడా పర్దిమాన్ పై కేసుపెడతామని హెచ్చరించింది. అయితే పర్దిమాన్ లొంగకపోవడంతో కేసువేసే ఆలోచన విరమించుకుంది. ఈ వివాదం కారణంగా దేశంలోని చిన్న మధ్య తరగతి షేర్ హోల్డర్లు ఇప్పటికే నష్టపోయారు. ఈ బొగ్గుగనిని కొనుగోలు చేయడానికి ముందు ఈ కంపెనీ షేరు విలువ రూ.42 ఉండేది వివాదం ఏర్పడిన తర్వాత ఒక దశలో ఎనిమిది రూపాయల 33 పైసలకు పడిపోయింది. ప్రస్తుతం 16 రూపాయల వద్ద నిలిచింది. ఈ వివాదం తర్వాత ల్యాంకో ఇన్ ఫ్రా టెక్  షేర్లు కొనుగోలు చేసిన చిన్న చిన్న మదుపరులు అపారంగా నష్టపోయారు.   

By
en-us Political News

  
భవనం పైకప్పు సమీపంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో నాలుగో తరగతి చదువుతున్న రెబికా అనే 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన నందిని అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక పోతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.