విజయసాయి రాజీనామా.. బీజేపీకి జగన్ ప్రేమసందేశమా?

Publish Date:Jan 25, 2025

Advertisement

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో పెను సంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ఉరుములేని పిడుగులా విజయసాయి ఇంత హఠాత్తుగా అదీ వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ప్రకటన చేయడం వెనుక కారణాలేమిటి? ప్రత్యేక వ్యూహాలేమైనా ఉన్నాయా అన్న సందేహాలు రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి, జగన్ సొంత పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ ఆయనకు వెన్నంటి ఉన్నారు. గతంలో అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ వ్యాపారాలకు ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయి, జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తరువాత ఏ2గా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు ఇంత హఠాత్తుగా విజయసాయి రాజకీయ జీవితం పట్ల వైరాగ్యం ప్రకటించి పార్టీకీ, పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులైతే విజయసాయి రాజీనామా ప్రకటన వెనుక ఉన్నది వైసీపీ అధినేత జగనే అని అంటున్నారు. ఒక విధంగా విజయసాయి రాజీనామా బీజేపీకి జగన్ పంపిన ప్రేమ సందేశం అని కూడా చెబుతున్నారు.  వాస్తవానికి విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం వైసీపీ మెరేల్ ను బాగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. విజయసాయి కూడా వైసీపీని వదిలేస్తే ఇక అసలు ఆ పార్టీలో మిగిలేవారెవరుంటారన్న సందేహం పార్టీ క్యాడర్ లో బలంగా వ్యక్తం అవుతోంది. తన రాజీనామా నిర్ణయం ప్రకటనకు ముందే ఈ విషయం విజయసాయికి తెలుసు అనడంలో సందేహం లేదు. అయినా విజయసాయి ఆ నిర్ణయం తీసుకున్నారంటే.. జగన్ తో ఆయనకు ఇక పూడ్చలేని అగాధమైనా ఏర్పడి ఉండాలి. కానీ జగన్ పట్ల విజయసాయి విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని ఆయన తన రాజకీయ సన్యాసం ప్రకటిస్తూ చేసిన ట్వీట్ ద్వారా అవతగమౌతోంది. మరి విజయసాయి నిర్ణయానికి కారణమేమిటన్న ప్రశ్నకు.. జగన్ ఆదేశం మేరకే విజయసాయి ఈ నిర్ణయం ప్రకటించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ రాజకీయాలలో వైసీపీకి ఇంక స్పేస్ లేదు. జగన్ ను జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలను నమ్మించి వారి విశ్వాసాన్ని మళ్లీ పొందేందుకు జగన్ ప్రయత్నాలు ఏవీ చేయడం లేదు. తాను కూసుల నుంచి బయటపడాలంటే బీజేపీ అండ అనివార్యం అని జగన్ కు స్పష్టంగా తెలుసు. అందుకే విజయసాయి చేత రాజీనామా చేయించి జగన్ బీజేపీకి ప్రేమ సందేశం పంపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి బీజేపీలో వెంటనే చేరకపోవచ్చు.. కానీ విజయసాయి రెడ్డి బాటలో ఇతర ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తారనీ, వారంతా బీజేపీకి అనుకూలంగా ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇప్పటికే బీజేపీకి జగన్ పంపారనీ అంటున్నారు. అయోధ్య రామిరెడ్డి రాజీనామా వార్తలు ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. అయోధ్యరామిరెడ్డి తన రాజీనామా వార్తలను ఖండించి ఉండొచ్చు.. కానీ ఆయన చాలా కాలంగా బీజేపీతో టచ్ లో ఉన్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఏ విధంగా చూసినా ఇప్పుడు విజయసాయి రాజీనామా వెనుక జగన్ వ్యూహమే ఉందనీ, తనను కేసుల నుంచి కాపాడుకునేందుకు పార్టీని ఫణంగా పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.