విజయసాయి.. వైసీపీకి గుదిబండేనా?

Publish Date:Sep 4, 2024

Advertisement

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి భారీ షాక్ తగిలింది.  ఏకంగా విశాఖ బీచ్ కబ్జాకు ఆయన తెగబడిన వైనం వెలుగులోనికి రావడమే కాకుండా, ఆలా కబ్జాచేయడానికి భీమిలీలో బీచ్ కు అడ్డంగా రిటైనింగ్ వాల్ తరహాలో కట్టిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చివేశారు.  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంత కాలం ఆయన పార్టీ ఉత్తరాంధ్రజిల్లాల ఇన్ చార్జిగా వెలగబెట్టారు.

ఆ సమయంలో విజయసాయి పెద్ద ఎత్తున కబ్జాలకు తెగబడ్డారు. నిన్నమొన్నటి వరకూ ఆరోపణలుగానే ఉన్న ఆయన కబ్జాల పర్వం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. విజయసాయి రెడ్డి  కుమార్తె నేహారెడ్డి భీమిలీ బీచ్ కు అడ్డంగా కట్టేసిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చేశారు. వాస్తవానికి గత ఐదేళ్లలో విశాఖ పరిపాలనా రాజధాని అంటూ వైసీపీ నేతలు చేయని దందా లేదు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి తన కుమార్తె, అల్లుడుకు విశాఖను రాసిచ్చేద్దామనుకున్నారా అన్నంతగా అడ్డగోలు కబ్జాలకూ, ఆక్రమణలకూ పల్పడ్డారు. తన కుమార్తె నేహారెడ్డి కోసం భీమిలీ బీచ్ ను ఆక్రమించేయడానికి ఏకంగా గోడకట్టేయగా దానినే బుధవారం (సెప్టెంబర్ 4) అధికారులు కూల్చేశారు.

అయితే విశాఖలో విజయసాయి రెడ్డి దందాలు ఇంకా చాలా చాలా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి తన అల్లుడు ఆయన కంపెనీల పేరుతో వందల ఎకరాలను అప్పట్లో ప్రభుత్వం నుంచి అప్పనంగా లాగేసుకున్నారు.  అలాగే అడ్డగోలు దందాలతో  వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారు. అయితే ఈ అడ్డగోలు భూ దందాపై వచ్చిన ఆరోపణలను  తన అల్లుడు, కుమార్తె కొనుక్కుంటే తనకేం సంబంధం అంటూ  విజయసారి తేలిగ్గా ఖండించేశారు.  

భీమిలి దగ్గర ఫైవ్ స్టార్ హోటల్ పేరు చెప్పి భూమిని కబ్జా చేయడమే కాకండా బీచ్ కు అడ్డంగా కట్టేశారు. సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధం గా కట్టిన కట్టడం కావడంతో కూల్చివేత భయంతో ముందుగానే కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆ గోడ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేయా లంటూ తీర్పు వెలువరించడంతో అధికారులు కూల్చివేశారు.  ఈ కూల్చివేతల్ని అడ్డుకోవడానికి కానీ, విజయసాయికి మద్దతుగా కానీ ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రాలేదు.   ఒక్క విశాఖ అనేమిటి, మొత్తం ఉత్తరాంధ్రలో వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగలకపోవడానికి విజయసాయి రెడ్డి నిర్వాకాలే కారణమని పార్టీ ఉత్తరాంధ్ర నేతలు, శ్రేణులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ఆ కారణంగానే విశాఖ నేతలెవరూ విజయసాయికి మద్దతు పలకడం లేదు. ముందు ముందు విశాఖలో విజయసాయి భూ దందాలు, కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నేహారెడ్డి అక్రమకట్టడం కూల్చివేత విజయ సాయి విజయసాయికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతూ రాకపోవడాన్ని చూస్తుంటే ఇక విజయసాయి రెడ్డి పార్టీలో పూర్తిగా ఒంటరి అయిపోయారన్న విషయం స్పష్టంగా అవగతమౌతోంది. ఆయన ఎంతగా చొక్కాలు చింపుకుని తాను వైసీపీని వీడే ప్రశక్తే లేదని చెప్పుకున్నా.. పార్టీ ఆయనను పట్టించుకునే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ విజయసాయిని గుదిబండగా భావిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.