విజయసాయికి సీక్రెట్ మిషన్ అప్పగించిన జగన్!

Publish Date:Jun 29, 2023

Advertisement

జగన్ పార్టీలో.. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్... తర్వాత స్థానం ఎవరిది అంటే.. గతంలో అయితే ఆ పార్టీ  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిది అని ఎవరైనా ఠపీమని ఇట్టే చెప్పేస్తారు. ఇటీవలి కాలంలో పార్టీలో విజయసాయి ప్రభ మసకబారింది. ఆయన నుంచి ఒక్కో బాధ్యతనూ తప్పించిన జగన్ ప్రస్తుతం కేవలం నామమాత్రపు పోస్టులో ఉంచి పార్టీలో కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ నెల 21న సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష కార్యక్రమంలో భాగంగా.. సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. విజయసాయి గురించి ఓ సంచలన ప్రకటన చేశారు. సాయన్న ముసలోడు అయిపోయాడు.. అందుకే అనుబంధ విభాగాల బాధ్యతలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించానంటూ అందరిలో విజయసాయి పరువును గంగలో కలిపారు. దీంతో విజయసాయి అలగారనీ, బుంగమూతి కూడా పెట్టుకున్నారనీ పార్టీలోనే కాకుండా రాజకీయవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక వైసీపీతో విజయసాయి బంధం పుటుక్కుమందన్న భావన కూడా సర్వత్రా వ్యక్తమైంది. అయితే విజయసాయికి పార్టీ బాధ్యతలు ఒక్కటొక్కటిగా తప్పించడం, ఆయనను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచడం వెనుక జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలోని కీలక నేతల నుంచి అందుతున్న సమాచారం. వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం కోసం పార్టీ వ్యవహారాలతో సంబంధం లేకుండా అత్యంత కీలకమైన బాధ్యతలను జగన్ విజయసాయి భుజస్కంధాలపై పెట్టారనీ, ఆ పనిలో విజయసాయి తలమునకలై ఉన్నారనీ ఆ వర్గాలు అంటున్నాయి. 
వచ్చే ఎన్నికల్లో పార్టీవిజయావకాశాలపై  సీఎం   జగన్ తన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారానే కాకుండా  ఐ ప్యాక్‌ సైతం  సొంతంగా  చేపట్టిన సర్వేల్లో దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయనీ, పార్టీ వచ్చే ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యం అని ఆ రెండు సర్వేల్లో తేలడంతో  ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి.. వరుసగా రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా దూసుకోపోవాలని పార్టీ వర్గాలకు  జగన్ స్పష్టంగా దిశానిర్దేశం చేయడమే కాకుండా, ఖర్చుకు వెనకాడకుండా ముందుకు సాగాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి నిధులను సేకరించే బృహత్తర బాధ్యతను జగన్ విజయసాయికి అప్పగించారంటున్నారు. అందుకే ఆయన నుంచి పార్టీ బాధ్యతలు ఒక్కటొక్కటిగా తొలగించారనీ చెబుతున్నారు. ఇప్పటికే విజయసాయి నిధుల సమీకరణ కోసం పని చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ‘గడప గడపకూ’ సమీక్షలో జగన్ విజయసాయిని ముసలోడని అన్నప్పటికీ.. అది పైపై ముచ్చటే కానీ, అంతర్గతంగా విజయసాయి మామూలోడు కాదు మహానుభావుడు అన్నదే జగన్ ఉద్దేశమని ఆ వర్గాలు చెబుతున్నాయి.  

మరోవైపు గతంలో సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్‌గా ఉండి.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అధినేతలపై  నానా బూతులు, వ్యంగ్య బాణాలతో  కామెంట్లు ఫోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం చాలా మర్యాదగా.. చాలా పద్దతిగా కామెంట్లు పెట్టడంపై కూడా చర్చ మొదలైంది. 

అదీకాక విజయసాయిరెడ్డి మరదలి కుమార్తె భర్త నందమూరి తారకరత్న మరణించిన  సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో వ్యవహరించిన తీరు నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై  జగన్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం సైతం హల్ చల్ చేసింది. ఆ తర్వాత నుంచి విజయసాయిరెడ్డిపై  జగన్ వైఖరిలో  మార్పు వచ్చిందన్న ప్రచారం సైతం నడిచింది.  

అలా వారిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్.. ప్రస్తుతం ఇలా పైకి కనిపించని బంధంగా కొనసాగుతోందని పార్టీలోని కీలక వర్గాల సమాచారం.  మరి ఎన్నికల నాటికి జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించేందుకు మరోసారి విజయసాయిరెడ్డి తెర చాటు రాజకీయానికి శ్రీకారం చుట్టానున్నరనే ఓ ప్రచారం పార్టీలో అంతర్గతంగా సాగుతోంది.

 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో అడిటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ విజయసాయిరెడ్డి.. నాటి నుంచి నేటి వరకు ఆయన ఎదిగిన పరిణామ  క్రమాన్ని ఓ సారి  పరిశీలిస్తే.. ఈ ఆడిటర్‌గారు మామూలోడు కాదనే ప్రచారం సైతం ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. 

పార్టీ అధినేత  జగన్.. ఢిల్లీలో ఏ పని అప్పగించినా.. లేదా ఓ మారుమూల ప్రాంతంలోని ఓ సాధారణ గల్లిలో పని అప్పగించినా క్షణాల్లో ఆ పని పూర్తి చేయడం ఈ ఆడిటర్ కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సూటికేస్ ఓపెన్ చేసి.. క్లోజ్ చేసింత ఈజీగా చేసేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.