వాస్తవ వేదిక.. వైసీపీకి ఢిల్లీ లాబీయింగ్ అంతా విజయసాయే

Publish Date:Feb 6, 2026

Advertisement

తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక పదకొండో సంచిక గురువారం (ఫిబ్రవరి 6) విడుదలైంది. ఈ సారి  కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల మార్పులపై విశ్లేషణాత్మక చర్చ జరిపారు.  

జగన్ మోహన్ రెడ్డి కేవలం ఎన్నికల ఓటమి తర్వాతే కాదు, ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో  ప్రజలకు మాత్రమే కాదు పార్టీ కార్యకర్తలకు కూడా దురమై  హైబర్నేషన్'(స్తబ్దత)లోకి వెళ్ళిపోయారనీ, అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఒక ప్రత్యేక బృందం ఉండేదనీ వారు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.  వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితిలో కార్యకర్తల విశ్వాసం పొందడానికి జగన్ చేస్తున్న ప్రయత్నంగా దీనికి అభివర్ణించారు.  రాష్ట్రంలో వైసిపి కార్యకర్తలు కేసుల భయంలో ఉన్నారనీ, ఈ పరిస్థితుల్లో వారిలో ధైర్యం నింపి మళ్లీ అధికారంలోకి వస్తామన్న విశ్వాసం కల్పించడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు.  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, తన ఉనికిని చాటుకోవడానికి సుమారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత పాదయాత్ర చేపట్టే ఆలోచనలో  ఉన్నారని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

 జగన్ డెమొక్రాట్ కాదు కానీ.. చంద్రబాబు నాయుడు  డెమోక్రాట్ అన్న డోలేంద్ర ప్రసాద్.. చంద్రబాబు జగన్ లా ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూడరనీ,  అయితే చంద్రబాబు ప్రస్తుతం  జగన్ పట్ల ప్రజల్లో ఉన్న భయం చాలు తనకు ఓట్లు పడతాయని ఆయన భ్రమిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల కంటే ఐఏఎస్ ఆఫీసర్లు, కార్పొరేట్ శక్తులకే   ప్రాధాన్యత ఇస్తారని, ఇది కార్యకర్తలలో అసంతృప్తికి దారితీస్తుందనీ, ఇప్పుడూ అదే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోందని డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు.  మూలాలు హెచ్చరిస్తున్నాయి. ఇక విజయసాయి రెడ్డి బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది కదా అన్న కంఠంనేని రవిశంకర్ ప్రశ్నకు డోలేంద్ర ప్రసాద్ విజయసాయి కేవలం రాజకీయ మానిపులేటర్ అన్నారు.  

ఆయన స్వయంగా ఏ ఎన్నికలోనైనా సరే గెలిచే ప్రశక్తే లేదనీ చెప్పారు. విజయసాయికి జగన్ పార్టీలో ఆదరణ తగ్గడం, వైసీపీ నుంచి బయటకు వచ్చిన తరువాత కేసుల భయం కారణంగా ఆయన బీజేపీ వైపు చూస్తుంటే చూస్తుండవచ్చునన్నారు.   కానీ బిజెపి  ఇప్పుడు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ విధానాన్ని అమలు చేస్తోందన్న డోలేంద్ర ప్రసాద్..  పదవుల విషయంలో సొంత క్యాడర్‌కే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందువల్ల విజయసాయికి బీజేపీలో ప్రాధాన్యత లభించే ప్రశక్తి లేదన్నదని తన అభిప్రాయమన్నారు. అయితే అదే సమయంలో   తెలుగుదేశం వైసిపి వంటి  పార్టీల సిద్ధాంతం అధికారమే కనుక ఆ పార్టీలలో ఎవరైనా ఎప్పుడైనా చేరే పరిస్థితి ఉంటుందన్నారు.  

 జగన్ తన ప్రసంగాల్లో "రప్ప రప్ప" వంటి పదాలను వాడుతూ అరాచక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. ప్రజలు రౌడీయిజం తమ ఇంటి గడప దాకా వస్తే సహించరనీ, గత ఎన్నికలలో జగన్ ఓటమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఇప్పటికీ మారకుండా జగన్ అదే ధోరణితో ఉండటం ఆయన  రాజకీయ భవిష్యత్తుకు ఇసుమంతైనా మేలు చేయదని డోలేంద్ర ప్రసాద్  అన్నారు. 

ఇలాంటి మరెన్నో ఆసక్తికర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ కోసం వాస్తవ వేదిక పదకొండో సంచికను తెలుగువన్ యూట్యూబ్ చానల్ లో వీక్షించండి

 

By
en-us Political News

  
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.