విజయసాయిరెడ్డి నోట మళ్లీ సొంత చానల్ మాట!

Publish Date:Jul 16, 2024

Advertisement

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నోట మరో సారి సొంత చానల్ మాట వచ్చింది. గతంలో కూడా ఒక సారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా చానల్, పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అప్పట్లో  అంటే ఆయన సొంత చానల్, పత్రిక ప్రకటన చేసిన సమయంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో ఆయన నంబర్ 2 స్థానాన్ని అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేసుకున్నారు. దీంతో ఆయనకు పార్టీలో ఇసుమంతైనా గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో  ఆయన సొంత చానల్, సొంత పత్రికా అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు. 

ఇప్పుడు మళ్లీ ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఒక మహాళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ఆ మహిళా అధికారి భర్తే ఈ ఆరోపణ చేశారు. ఫిర్యాదు సైతం చేశారు. వైసీపీ తరఫున ఈ వార్తలను ఖండించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా విజయసాయిపై ఆరోపణలను ఖండించలేదు. దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అర్రులు చాస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. అదే సమయంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా.. తాను ఏ పార్టీలో ఉన్నా తన చానల్ మాత్రం నిఖార్సైన వార్తలే ప్రసారం చేస్తుందని చెప్పండం ద్వారా పార్టీ మారే అవకాశాలున్నాయన్న విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించి, ఒక విధంగా వైసీపీ అధినేత జగన్ ను బ్లాక్ మెయిల్ చేశారని కూడా చెప్పవచ్చు. 
వాస్తవానికి విజయసాయి రెడ్డి పార్టీలో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సమయంలో మాత్రమే జగన్ పై ఒకింత ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.  

విజయసారిరెడ్డికి పార్టీలో ఉక్కపోత మొదలైనా.. సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు ఎదురైనా ఆయన సొంత మీడియా అంటూ ముందుకు వస్తున్నారు.  గతంలో వైసీపెలో నెంబర్ 2 గా ఓ వెలుగు వెలిగిన విజయ సాయి రెడ్డికి ఆ పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీలో ఆయనను పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఇప్పుడు అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరౌతున్న విజయసాయి.. సెల్ఫ్ డిఫెన్స్ కోసం సొంత టీవీ చానల్ అంటూ హడావుడి చేస్తున్నారు.  

అయితే గతంలో విజయసాయి సొంత చానల్ అని ప్రకటించిన సమయంలో ఆయనకు ఢిల్లీ పెద్దలతో పాటుగా  పొరుగు రాష్ట్రానికి  చెందిన ముఖ్యనేత అండదండలున్నాయన్న వార్తలు వచ్చాయి.  అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఢిల్లీలో  చక్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లో ఉంది. ఆయనకు నచ్చని పని చేయడానికి ఢీల్లీ పెద్దలు సాహసించే అవకాశం లేదు. ఇక పొరుగు రాష్ట్రం నుంచి కూడా విజయసాయికి సహకారం అందే అవకాశం లేదు. ఏపీలో వైసీపీ పరిస్థితిలాగే, పొరుగు రాష్ట్రంలో గతంలో విజయసాయికి అండదండగా నిలవడానికి ముందుకు వచ్చిన నేత ఉన్న పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయికి ఎటు నుంచీ సహకారం అందే అవకాశాలు లేవు. 

ఇప్పుడేమిటి చాలా కాలంగా వైసీపీలో విజయసాయి రెడ్డి ఉక్కపోతకు గురవుతున్నారు.   జగన్ రెడ్డి ఒకటొకటిగా విజయ సాయి పదవులు కత్తిరిస్తూ వస్తున్నారు. మరో వంక, విశాఖ భూదందాల బాగోతంలో విజయసాయి పీకలోతు కూరుకుపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ రెడ్డి కాదుకదా, వైసేపీ నాయకులు ఎవరూ  ఆయనకు అండగా విజయసాయిపై ఆరోపణలు ఖండించడానికి ముందుకు రావడం లేదు. ఎవరూ ముందుకు రాని కారణంగానే జూపూడిని పక్కన పెట్టుకుని విజయసాయి సోమవారం (జులై 15) మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఈ పరిస్థితుల్లో విజయసాయి సొంత చానెల్ ప్రకటనను ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.