జగన్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి విజిలెన్స్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు. వైసీపీ హయాం అనేమిటి.. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కరరెడ్డే తుడా చైర్మన్. ఇక తుడా చైర్మన్ గా చెవిరెడ్డి అక్రమాలకు కొదవే లేదన్నఆరోపణలూ మెండుగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తుడా చైర్మన్ గా ఆ సంస్థ ఆదాయాన్ని సొంత అవసరాలకు విచ్చలవిడిగా వాడుకున్నారన్నఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. తన సొంత గ్రామంలో పనులు చేయించడానికి.. వ్యక్తిగత పనులు, ప్రయాణాలకు కూడా తుడా నిధుల్ని ఇష్టారీతిగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మొత్తం తుడా నిధుల్లో 90 శాతం నిధులను చెవిరెడ్డి సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో పనులు చేయించడానికే వాడుకున్నారనీ, తుడా నిధులతో చేసిన పనులకు కూడా ఏదో తన సొంత సొమ్ము ఖర్చు చేసి చేయించినట్లుగా తన పేరే వేయించుకున్నారనీ విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా ఆ పనుల చేసే కాంట్రాక్టును తన సొంత కంపెనీకే కట్టబెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనీ ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ హయాంలో అంటే 2019-24 మధ్య కాలంలో తుడాలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జనవరిలో విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దగి దర్యాప్తు చేపట్టారు. తాజాగా చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. మొత్తం 37 ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు జారీ చేసిన విజిలెన్స్ అధికారులు ఈ నెల 9లోగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. చెవిరెడ్డితో పాటు మరో 15 మందికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. తుడా సంధించిన ప్రశ్నలకు చెవిరెడ్డి ఇచ్చే సమాధానాల ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vigilence-notices-to-chevireddy-39-199355.html
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.