బూతుల నాని ఖాతాలో భారీ కుంభకోణాలు.. కూపీ లాగుతున్న విజిలెన్స్!?

Publish Date:Nov 27, 2024

Advertisement

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన శాఖ ఏమిటి అన్నది కూడా ఎవరికీ తెలియదు. కానీ జనం మాత్రం ఆయనను అప్పట్లో బూతుల సరఫరా శాఖ మంత్రి అనే భావించేవారు. అయినా కొడాలి నాని తన అవినీతి, అక్రమాలతో, బూతు భాషా ప్రావీణ్యంతో యమా గుర్తింపు పొందారు. అయితే ఆయన యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినా, నోటిని అదుపులో ఉంచుకోవడం అంటే ఏమిటో తలియనట్లుగా ప్రత్యర్థి పార్టీల నేతలపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ పై బూతుల ప్రవాహాన్ని తలపించేలా తన వాగ్ధాటిని ప్రదర్శించినా అదంతా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలమే.

వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొడాలి నాని చాలా వరకూ నోటికి తాళం వేసేసుకున్నారు. అధికారంలో ఉండగా తమ పార్టీ అధినేత జగన్ పరదాలు కట్టుకుని మరీ ప్రజల ముందుకు వెళ్లినట్లు ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత  కొడాలి నాని ప్రజలకు కనిపించకుండా ముఖం దాచేసు కుంటున్నారు. ఓ సారి తిరుపతిలో కొత్త అవతారంతో దర్శనమిచ్చారు. ఆ తరువాత కూడా ఒకటి రెండు సందర్భాలలో తన ట్రేడ్ మార్కు గడ్డం లేకుండా పబ్లిక్ లో కనిపించారు. నోట్లో గుట్కా, చెంపలు కనిపించకుండా గడ్డంతో ఉంటేనే  ఎవరైనా కొడాలి నానిని గుర్తుపట్టగలరని ఆయన భావిస్తున్నారేమో. అక్కర్లేదు బూతులు లేకుండా ఓ రెండు నిముషాలు మాట్లాడితే ఆయన నేను కొడాలి నానినే అని చెప్పినా జనం నమ్మరు. అంతలా ఆయన తన బూతు భాషా ప్రావీణ్యంతో మమేకమైపోయారు. 

సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ముసలిదైపోయిన పులి మాంసాహారం మానేశానని చెప్పినట్లు ఇప్పుడు అధికారం అండ లేని నాని బూతులు మానేశాను. ఇక అవినీతి పనులకు పాల్పడను అని చెప్పినంత మాత్రాన చేసిన తప్పులు ఒప్పైపోతాయా? కర్మ అనుభవించక తప్పదు కదా? కొడాలి నాని విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.  ఇసుక మాఫియా, రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ స్కాములలో  కొడాని నాని ప్రమేయం ఇప్పుడు బయటకు వచ్చింది.

వీటికి తోడు  గుడివాడ నియోజకవర్గంలో  రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు శాంక్షన్ చేయించుకున్న కొడాలి నాని వాటిలో    ఇళ్ల నిర్మాణానికి కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ నాని బినామీలే దక్కించుకున్నారనీ వెల్లడైంది.  ఈ నిర్మాణాలకు విడుదలైన 40 కోట్ల రూపాయలలో కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వగా  మిగిలిన 33 కోట్ల రూపాయలనూ నాని అండ్ గ్యాంగ్ బొక్కేశారని తేలింది. ఈ కుంభకోణంలో కొడాలి నాని అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్, పాలెడుగు రామ్ ప్రసాద్, కుసికుర్తి బాబు, కొత్తి విజయ్ లను నిందితులుగా తేల్చిన విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ కుంభకోణాల వెనుక కొడాలి నాని ప్రమేయంపై కూపీ లాగుతున్నారు. రానున్న రోజులలో కొడాలి నాని సహా  ఈ కుంభకోణాలలో ప్రమేయం ఉన్న అందరిపై చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.