విద్యానిధి పథకానికి జగన్ పేరా!
Publish Date:Jul 16, 2022
Advertisement
పేరు మార్చుకోవడం ఈ రోజుల్లో చాలా సహజంగా జరిగిపోతోంది. పాతకాలం పేర్లు నచ్చక ఈ తరం యువత వారి పేర్లు మార్చేసుకుంటున్నారు. సరే అది వారి వ్యక్తిగతం. కానీ రాష్ట్రంలో విద్యార్దులకు ఎంతో ఉపయోగపడుతున్న విదేశీ విద్యానిధి పథకానికి పేరు మార్చడంలో ఆంధ్రా సిఎం జగన్ దుస్సా హసమే చేశారనాలి. ఈ పథకం అంబేద్కర్ పేరుతో పిలవబడుతోంది. కానీ జగన్‌కి ఎందుకో నచ్చలేదు. రాష్ట్రం లో అన్ని పథకాలకు తన పేరు పెట్టేసుకున్నట్టే ఈ పథకానికి తన పేరు పెట్టుకున్నారు. ఇది జగన్ అహంకారమేనని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్ డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేం దుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశామని తెలిపారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థు లకైతే రూ.15 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు. ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థులు విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందన్నారు. మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అంబేద్కర్ పేరును తొలగించి జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయ నను అవమానించడమే అని అన్నారు. ఇది జగన్ అహంకారమే అంబేద్కర్‌ను దైవంగా భావించే వారంద రినీ కూడా అవమానించినట్టే అని తెలిపారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరు పెట్టా లని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదిలావుండగా, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకానికి జగనన్న విదేశీ విద్య దీవెనగా పేరు మార్పుపై అమరావతి దళిత నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఅర్ అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు ఎలా పెట్టుకుంటారంటూ నిరసనకు దిగారు. దళిత రైతులు, నేతలు తుళ్ళూరు అంబేడ్కర్ విగ్రహానికి నివాళు లు అర్పించి అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. అంబేద్కర్ పేరు ఈ పథకానికి కొనసాగిస్తూ మరో ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/vidyanidhi-scheme-named-after-jagan-25-139879.html





