బాబుదే జయం.. ఇది ఖాయం!

Publish Date:Sep 25, 2023

Advertisement

స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన క్షణం నుంచీ వైసీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డాయి. అరెస్టు సక్రమమని చెప్పలేక, తమ అధినేతను ధిక్కరించే ధైర్యం చేయలేక గింజుకుంటున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలూ అవసరం లేదనీ, వారి పని ఘనత వహించిన పోలీసు అధికారులే చేసేస్తున్నారనీ అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తూ, తమ భవిష్యత్ పై బెంగటిల్లుతున్నారు.

ఇప్పటి వరకూ రాజకీయాలలో ఇటువంటి కక్ష సాధింపు తీరును ఎన్నడూ చూడలేదని అంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని  నమ్మించేందుకు సర్కార్ ఎంతగా గొబెల్స్ ప్రచారం చేస్తున్నా సొంత పార్టీ క్యాడరే ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. అదే సమయంలో అదే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుణ్యమా అని తమ పిల్లలు బాగుపడ్డారనీ, మంచి ఉద్యోగాలలో సెటిలయ్యారనీ వైసీపీ క్యాడరే అంటోంది.  అన్నిటికీ మించి గత పక్షం రోజులుగా కేసు తీరు తెన్నులను,  సీఐడీ చీఫ్ పత్రికా సమావేశాలను గమనిస్తున్న వారంతా రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే అంటున్నారు.  

 క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన, చూస్తున్న నేతలైతే.. వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్లడం అసాధ్యమని బాహాటంగానే చెబుతున్నారు.  చంద్రబాబును అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి పార్టీ పాలిట, తమ పాలిట భస్మాసురుడుగా మారారనీ, ఆయనతో తమకు కూడా రాజకీయంగా మరణశాసనం రాసేశారనీ చెబుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే.. అది ఎంత అక్రమంగానైనా సరే.. తెలుగుదేశం పార్టీ కుదేలౌతుందనీ, ఆ పార్టీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు అవసరమైన దిశ, దశ అందిచే నాయకుడు దూరమై నిస్తేజమైపోతుందనీ జగన్ ఊహించారనీ, అయితే ఆయనే కాదు.. అసలు ఎవరూ ఊహించనంత తీవ్రంగా ఆయన అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆందోళనలతో జగన్ రెడ్డి, ఆయన పార్టీయే ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో, ఏం చేసినా ఇక లాభం లేదన్న నిస్తేజంలో మునిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రోటిలో తలపెట్టేశాం.. ఎన్నికలలో రోకటి పోటు తినాల్సిందే అన్న నిశ్చితాభిప్రాయానికి వైసీపీ నేతలూ, క్యాడర్ వచ్చేశారని అంటున్నారు. 

 ఈ నేపధ్యంలోనే 2019 ఎన్నికల్లో, ఒక్క ఛాన్స్   వ్యూహంతో వైసీపీని గెలిపించిన, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్’కిశోర్ సైతం  చంద్రబాబు అరెస్ట్ తరువాత జగన్ని తప్పు చేశావ్ అని హెచ్చరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందే జగన్ కు నో అనదర్ చాన్స్ అన్న నిర్ణయానికి వచ్చేసిన ఏపీ ప్రజలు.. ఇక ఇప్పుడు జగన్ ను ఓడించేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, చంద్రబాబు అప్పటికీ రిమాండ్ లోనే తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు తెగించి బయటకు వస్తామని జనం స్వచ్చందంగా చెబుతున్నారు.

ఈ విషయం తాజా సీఓటర్ సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా విజయం తెలుగుదేశం పార్టీదేనని ఆ సర్వే పేర్కంది.   చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను  స్పందిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆర్థిక, రాజకీయ, సినీ పరిశ్రమలకు చెందిన వారు స్వచ్ఛందంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. జగన్ సర్కార్ తీరును ఖండిస్తున్నారు. ప్రాంతీయ, భాషా బేధాలకు అతీతంగా అన్ని వైపుల నుంచీ, అన్ని వర్గాల నుంచీ చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తం అవుతున్నది. 

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.