Publish Date:Aug 11, 2022
భక్తి, ప్రేమలు మనసులో ఉండాలే గాని మైకుల్లో గోలచేయ నక్కర్లేదు. భారీ ప్రచారాలేమీ అక్కర్లేదు. చిన్న పాటి పని చాలు. అమృతోత్సవ్ పేరు తో బీజేపీవారికున్నంత దేశభక్తి మాకు లేదుగాని మాకున్నంతలో మాదీ దేశభక్తే అంటున్నారు కూర గాయల మార్కెట్లో దుకాణాలవారూ. నిజమే రాజకీయనాయకులకు, పారిశ్రామిక వేత్తలకే కాదు అందరికీ ఉంటుంది. ఎవరి స్థాయిలో వారు దాన్ని ప్రదర్శిస్తారు.
ఇది ఏ ఊరు, ఎక్కడా అన్నది అవతలపెడితే, అసలు ఇలా కూడా దేశభక్తిని ప్రదర్శించవచ్చన్న ఆలోచనకే జయహో అనొచ్చు. మార్కెట్లో వారంతా ఆశ్చర్యపోయారు. అందరూ ఇలానే వారి దుకాణాల ముందు ఏర్పాటు చేశారు. పారిశ్రామిక వేత్తలు వారి సంస్థల పైనా జెండా ఏర్పాటు చేస్తారు, నాయకులు వారి వారి కార్యాలయాల్లో, స్కూళ్లలో ఉపాధ్యాయులు. కూరగాయలు అమ్మేవారు మార్కెట్లో పెట్టుకున్నారు. వీరి ప్రయత్నం బహుశా రైతుల పరంగా దేశభక్తిని ప్రకటిస్తున్నారేమో! దేశానికి వెన్నెముక రైతాంగం అనేది అనాదిగా మన దేశం గురించి చెప్పుకుంటూన్నాం. కానీ ప్రభుత్వాలేవీ ఇటీవలి కాలంలో వారి గోడే పట్టించుకోవడం లేదు. అందుకే వారు ఆగ్రహించి ఎదురుతిరుగుతున్నారు. ఇదే ఆ మధ్య గుజరాత్ రైతాంగం చేసి నది. ధడిసి, ఏమీ చేయలేని స్థితిలో కేంద్రం దిగివచ్చింది.
రైతుల సంరక్షణే మా లక్ష్యం అంటూ అజెండాల్లో రాసుకునే మహానేతలు రైతుల వెన్నే విరుస్తున్నారు. తిండిపెడుతున్నవారికే తిండి లేకుండా చేయడానికి సాహసిస్తున్నారు. అంతా పారిశ్రామిక వాడలవుతున్నాయే గాని పంటభూములు దెబ్బతింటు న్నాయన్నది తెలియకా కాదు. ఏదో ఒక పండగరోజునో, స్వాతంత్య్రదినోత్సవం రోజునో రైతాంగాన్ని ఆకాశానికి ఎత్తే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రైతుల్ని గుర్తుచేసుకోవడమే అవుతోంది. కానీ వారి దేశభక్తి ఉందన్నది కూరగాయలు అమ్మేవారి ద్వారా ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vegetable-vendors-patriotism-25-141776.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.