కేరళం నూతన సీఎంగా వీడీ సతీషన్..!
Publish Date:May 14, 2026
Advertisement
కేరళం నూతన ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ వీడింది. వీడీ సతీషన్‌ను సీఎంగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రధానంగా వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ రేసులో నిలవగా ఏఐసీసీ వీడీ సతీషన్ వైపే మొగ్గు చూపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇప్పటికే గవర్నర్‌ను కోరింది. దీంతో త్వరలోనే వీడీ సతీషన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించి, యూడీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి బయటకు వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చలు జరిపారు. ఈ ప్రకటనతో కేరళలో రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లయింది
http://www.teluguone.com/news/content/vd-satheesan-as-the-cm-of-kerala-36-219743.html





