బీజేపీకి కాక్రోచ్ టెన్షన్.. కాషాయ పార్టీకి ఇక కష్టాలేనా..!

Publish Date:Jul 30, 2026

Advertisement

 

ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు దేశ రాజధానిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న గొంతుకలు ఒక్కసారిగా గర్జించడంతో కేంద్ర పాలకులు సైతం భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు... ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నైరాశ్యం, ఉపాధి లేమి, విద్యా వ్యవస్థలోని లోపాలు, ప్రజాస్వామ్య హక్కుల కాలరాచివేతపై సామాన్యుడు విసిరిన సమరభేరి. ఈ అంశాలపై టోన్ న్యూస్ వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగువన్‌ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు. 

అధికార గర్వాన్ని ఎదిరించిన సామాన్యుడి ఆక్రోశం..!

దేశంలో గత కొన్ని ఏళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఒకరి చేతుల్లో బందీ అయిపోయాయన్న ఆవేదన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా ఉద్యోగాలు రాక, రోజువారీ బతుకుదెరువు కోసం గిగ్ వర్కర్లుగా మారుతున్న యువత కడుపు మంట ఈ ఉద్యమానికి ఇంధనంగా మారింది. ఏటా ఫలితాల్లో అక్రమాలు, నిరుద్యోగం, మరోవైపు కార్పొరేట్ల లబ్ధి కోసం అమలవుతున్న విధానాలు సామాన్య కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తమ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని గ్రహించిన యువత, ఇళ్లలోని నిశ్శబ్దాన్ని వీడి వీధుల్లోకి వచ్చింది.

రక్తమోడిన వీధులు... గుండె బలంతో నిలబడిన యువత..!

ఢిల్లీ వీధుల్లో కనిపించిన దృశ్యాలు ప్రతీ భారతీయుడి హృదయాన్ని ద్రవీంపజేసాయి. లాఠీలు దెబ్బ తింటున్నా, రక్షక భటులే రక్షకులు కాక భయానక వాతావరణం సృష్టిస్తున్నా యువకులు వెనక్కి తగ్గలేదు. "మమ్మల్ని కాల్చండి... కానీ మా భవిష్యత్తును కాపాడండి" అంటూ నినదిస్తూ పోలీసుల ముందే నిలబడిన దృశ్యాలు స్వాతంత్ర్య పోరాట సమయాలను గుర్తుచేశాయి. ఒక సాధారణ అమ్మాయి రక్షణ వాహనానికి అడ్డంగా నిలబడి తన నిరసనను వ్యక్తం చేయడం, తమ హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిన సామాన్యుల తెగువకు అద్దం పడుతోంది. 16 మెట్రో స్టేషన్లను మూసివేసి, ఇంటర్నెట్‌ను నిలిపివేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, గుండెల్లో రగులుతున్న కడుపు మంట ముందు ఏ ఆంక్షలూ నిలవలేకపోయాయి.

ప్రజాస్వామ్యంలో కొత్త ఆశల చిగురు..!

ఈ సుదీర్ఘ పోరాటం వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలూ లేవు, ఏ నాయకుడి స్వార్థమూ లేదు. ఇది స్వచ్ఛందంగా, ఆవేదనలోంచి ఉద్భవించిన ఒక అగ్నిపర్వతం. ఎండనక, వాననక వీధుల్లో రాత్రంతా గడిపిన ప్రతీ యువకుడి వెనుక ఒక పేద కుటుంబం ఆశలు ఉన్నాయి. "మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో" అని రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా తల్లడిల్లిన తల్లిదండ్రుల కన్నీళ్లు ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మౌనం వహించిన చోట, ఈ యువ శక్తి చూపించిన సాహసమే ఈనాడు పాలకవర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఉద్యమం మనకు నేర్పిన పాఠం ఒకటే... ఎంతటి బలమైన అధికారమైనా ప్రజల ఆక్రోశం ముందు తలవంచక తప్పదు. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

 

 

Vasthava Vedika, Kanthamneni Ravi Shankar, Dolendra Prasad, Cockroach party, Gig Workers Strike Delhi, BJP

By
en-us Political News

  
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.