ఆ నరకం ‘వర్ణ’నాతీతం
Publish Date:Nov 22, 2013
Advertisement
అందాల అభినేత్రి అనుష్క పది సినిమాలు చేస్తే అందులో కేవలం ఒకటి మాత్రమే విజయం సాధిస్తున్నపటికీ తెలుగు చిత్ర సీమలో బాగానే నిలద్రోక్కుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆమె అందం, నటనలో లోపంలేకపోవడం వలననే ఆమెకు ఇంకా అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చును. చాల రోజుల తరువాత ప్రభాస్ తో చేసిన మిర్చి సినిమా సూపర్ హిట్ అయింది గనుక, మళ్ళీ తన ఫ్లాప్ రికార్డ్ పదిలంగా నిలబెట్టుకొంటూ ‘వర్ణ’ చేసింది. పది పంచ్ డైలాగులు, ఆరు పాటలు, నాలుగు ఫైట్స్, ఒక ఐటెం సాంగుకి బాగా ట్యూన్ అయిపోయిన జనాలని వేరే గ్రహం మీదకు తీసుకు వెళ్లాలని నిర్మాత చేత రూ.65కోట్లు ఖర్చు పెట్టించినా జనాలు మాత్రం వెళ్లేందుకు ఇష్టపడలేదు. పైగా దియేటర్లో ఈ నరకం ‘వర్ణ’నాతీతమని ట్వీట్ మెసేజులు ఫేస్ బుక్ మెసేజీలు పెట్టుకొంటూ ప్రేక్షకులు తమ స్నేహితులని ఈ సినిమా భారి నుండి కాపాడే ప్రయత్నం చేయడం విశేషం. ఇక ఈ వర్ణ సినిమా గురించి క్లుప్తంగా వర్ణించుకొంటే, ఈ సినిమాలో అనుష్క, ఆర్య ఇద్దరూ సింగిల్ పెమెంట్ కి డబుల్ రోల్స్ చేసారు. ఒకటి మన మధ్యనే ఈ భూమీద మరొకటి వేరే గ్రహం మీద. భూమీద రమ్య (అనుష్క) డాక్టరుగా, మధు బాలకృష్ణ (ఆర్య) లెక్చరర్ గా మామూలు మనుషులే. కానీ వేరే గ్రహంలో వర్ణ (అనుష్క) ఒక గొప్ప యుద్దనారి, మహేంద్ర (ఆర్య) ఒక యువరాజు. భూమ్మీద వీరిద్దరి లవ్ స్టోరీ మూడు పాటలేసుకొంటూ చాలా స్మూత్ గానే సాగిపోతుంది. కానీ వేరే లోకంలో మాత్రం వన్ సైడ్ లవ్ స్టోరీ. అంటే రామేశ్వరం వెళ్ళినా అన్నట్లు వేరే గ్రహం వెళ్ళినా మన కాన్సెప్ట్ మాత్రం మారదన్నమాట. అక్కడ యువరాజు గారు వర్ణని ప్రేమిస్తుంటాడు. అయితే భూమ్మీద ఉన్నఅర్యుడికి అర్జెంటుగా వేరేలోకం వెళ్ళవలసి రావడంతో చెప్పాపెట్టకుండా లిఫ్ట్ ఎక్కిపై అంతస్తుకి వెళ్ళినట్లు వేరే గ్రహానికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత అక్కడ లవ్ స్టోరీ ఏమయింది? అక్కడ ఎలాంటి ఫైట్స్ జరిగాయి? చివరికి ఈ రెండు జంటలు ఏవిధంగా కలిసాయి? అన్నదే దీని ఇష్టోరీ. భూమ్మీద అనుష్క, ఆర్యాలిద్దరూ బాగానే చేసినప్పటికీ వేరే గ్రహం మీద వెళ్లేసరికి అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువయిందో మరేమో కానీ ఇద్దరూ తేలిపోయారు. అసలు ఇటువంటి జమానాలో కూడా ఇంత వర్ణనాతీతమయిన నరకం చూపగల సినిమాను తీసిన దర్శకుడు శ్రీ రాఘవను, అతనిపై ఇన్ని కోట్లు కుమ్మరించిన ప్రసాద్ వి. పొట్లూరి దైర్యానికి ప్రత్యేక అవార్డులు ఈయవలసిందే. ఈ సినిమాలో ఏమి చెప్పాలనుకొంటున్నాడో దర్శకుడి తెలియదు. ఏమి చేస్తున్నారో నటులకీ తెలియదు. ఎందుకు సంగీత వాయించవలసి వచ్చిందో సంగీత దర్శకుడికి తెలియదు. ఏమి చూస్తున్నారో ప్రేక్షకులకి అర్ధం కాదు. కనుక అసలు ఈ సినిమా గురించి ఆలోచించి బాధపడటం అనవసరం. ఇంత చదివిన తరువాత కూడా ఈ సినిమాకి రేటింగ్ ఎంత?అని వెతికేమాటయితే, వెళ్లి ఆ సినిమా చూసి తెలుసుకోవడమే బెటర్. బ్యానర్: పివిపి సినిమా నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి; కథ, కథనం, దర్శకత్వం: శ్రీ రాఘవ; తారాగణం: ఆర్య, అనుష్క, అశోక్ కుమార్ తదితరులు; నేపథ్య సంగీతం: అనిరుధ్;; సంగీతం: హారిస్ జైరాజ్; ఛాయాగ్రహణం: రామ్‌జీ
http://www.teluguone.com/news/content/varna-32-27687.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





