డల్లాస్‌లో వల్లభనేని వంశీ దొంగబతుకు!

Publish Date:Aug 5, 2024

Advertisement

ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టుగా తయారైంది వల్లభనేని వంశీ పరిస్థితి. ప్రొడ్యూసర్‌గా హిట్ సినిమా తీసి, ఎమ్మెల్యేగా హవా నడిపి, అధికార పార్టీ నాయకుడిగా మకుటం లేని మహారాజులా చెలామణి అయి, అధికారం తెచ్చిన అహకారంతో అడ్డమైన వాగుడు వాగిన వల్లభనేని వంశీ బతుకు చివరికి దొంగ బతుకైపోయింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసిన కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అయ్యేసరికి వల్లభనేని వంశీ అమెరికాలోని డల్లాస్‌కి పారిపోయినట్టు తెలుస్తోంది. డల్లాస్‌లో దొంగలాగా నక్కినక్కి తిరుగుతున్న వల్లభనేని వంశీ కొంతమంది తెలుగువాళ్ళ కళ్ళలో పడ్డాడని, సాటి తెలుగువాడు కదా అని వాళ్ళు పలకరించే ప్రయత్నం చేస్తే, అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ పనికిమాలిన వాడు అని ఆల్రెడీ అందరికీ తెలుసు... పిరికివాడు కూడా అనే విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.

‘‘స్థానబలిమే కాని తనబలిమి కాదయా.. విశ్వదాభిరామ వినుర వేమ’’ అని వేమన చెప్పినట్టు, ఈ వైసీపీ చెత్తగ్యాంగ్‌కి అధికారంలో వున్నప్పుడే ధైర్యం వుంది తప్ప, అధికారం పోగానే అందరూ పిరికి సన్నాసులు అయిపోయారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ‘చంద్రబాబు ఏమీ పీకలేడు’ అనే స్థాయి డైలాగులు, సవాళ్ళు విసిరిన వల్లభనేని వంశీకి, అధికారం పోగానే తనది బలుపు కాదని అర్థమైంది. తాను నిజమైన శక్తివంతుడు కాదని, స్థానబలంతో అరిచే ఊరకుక్కకి, తనకి ఎంతమాత్రం తేడా లేదనే విషయం అవగతం అయింది. అందుకే, ఒక చిన్న కేసుకు భయపడి పారిపోయాడు. టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించిన కేసులో మహా అయితే ఏం చేస్తారు? పడితే కొద్ది నెలలపాటు జైలు శిక్ష పడుతుంది. అంతేతప్ప తల తీసి మొలేయరు కదా? వల్లభనేని వంశీకి బాస్ జగన్ 16 నెలలో జైల్లో గడిపి, హ్యాపీగా నవ్వుకుంటూ బయటకి వచ్చాడు. ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కొద్ది నెలలపాటు జైల్లో వుండలేనంత పిరికిసన్నాసి వల్లభనేని వంశీ. టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించిప్పుడు చూపించిన తెగువలో వన్ పర్సెంట్ కూడా లేకుండా పోయింది ఈ పిరికి పిల్లికి!

By
en-us Political News

  
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.