తిరుపతి తొక్కిసలాట ఘటన క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం
Publish Date:Jan 9, 2025
Advertisement
తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చి తిరుపతిలో ఆ టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని గురువారం (జనవరి 9) చంద్రబాబు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన వారికి వైకుంఠద్వార దర్శనం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తొక్కిసలాట ఘటనలో గాయపడిన 52 మందికి ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని తిరుమల తీసుకువెళ్లి టీటీడీ అధికారులు దగ్గరుండి వైకుంఠ ద్వార దర్శనం చేయించారు. దీనిపై వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ణతలు తెలిపారు.
http://www.teluguone.com/news/content/vaikuntha-dwara-darshanalu-to-tirupathi-stampede-39-191114.html





