వాహనదారులకు షాక్: నెల రోజుల్లో ఆ పని చేయకపోతే చలాన్లు నేరుగా మీ ఇంటికే
Publish Date:Jun 3, 2026
Advertisement
మీకు బైక్ లేదా కారు ఉందా? అయితే తెలంగాణ రవాణా శాఖ జారీ చేసిన ఈ సరికొత్త హెచ్చరికను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రాష్ట్రంలో వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. మీ వెహికల్‌కు సంబంధించి వాహన్ (Vahan) డేటాబేస్‌లో మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీలను అప్‌డేట్ చేయడానికి రవాణా శాఖ కేవలం నెల రోజులు అంటే 30 రోజుల గడువును మాత్రమే విధించింది. ఒకవేళ మీ పాత నెంబర్ మారిపోయి ఉంటే, వెంటనే కొత్త నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యం చేస్తే భవిష్యత్తులో భారీ పెనాల్టీలు మరియు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఈ కొత్త నియమాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందనే సందేహం మీకు రావచ్చు. సాధారణంగా రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులు ఆన్‌లైన్ ద్వారా ఈ-చలాన్ విధిస్తుంటారు. అయితే, చాలా మంది వాహనదారుల పాత మొబైల్ నెంబర్లు వాహన్ పోర్టల్‌లో ఉండటం వల్ల వారికి చలాన్ తాలూకు మెసేజ్‌లు వెళ్లడం లేదు. దీనివల్ల మాకు అసలు చలాన్ పడిన విషయమే తెలియదు అంటూ చాలా మంది వాహనదారులు పెనాల్టీలు కట్టకుండా తప్పించుకుంటున్నారు. ఈ పెద్ద సమస్యకు పూర్తిగా చెక్ పెట్టడానికే రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీసులు కలిసి ఈ జాయింట్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై వాట్సాప్, ఎస్ఎంఎస్ (SMS) లేదా ఈమెయిల్ ద్వారా పంపిన చలాన్లు మీకు అధికారికంగా అందినట్టుగానే ప్రభుత్వం భావిస్తుంది. నాకు మొసేజ్ రాలేదు, చలాన్ పడినట్లు నాకు తెలియదు అనే సాకులు ఇకపై అస్సలు నడవవని అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. రవాణా శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ 1 నెల రోజుల డెడ్‌లైన్ ముగిసిన తర్వాత, వాహన్ పోర్టల్‌లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్‌కే చలాన్ నోటీసులు పంపుతారు. ఒకవేళ మీ నెంబర్ తప్పుగా ఉండి మీకు మెసేజ్ రాకపోయినా, చలాన్ మీకు లీగల్‌గా డెలివరీ అయిపోయినట్టే లెక్కగడతారు. దీనివల్ల వాహనదారులకు తెలియకుండానే పెనాల్టీలు భారీగా పెరిగిపోతాయి. అంతేకాదు, వెహికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదా ఇతర ఆర్‌టిఓ పనుల సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ డిజిటల్ ఛానల్స్ ద్వారా చలాన్లను పంపడం వల్ల కాగితం వాడకం తగ్గడమే కాకుండా, ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. కాబట్టి వెంటనే మీ వాహనానికి లింక్ అయిన కాంటాక్ట్ డీటెయిల్స్‌ను ఒకసారి ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకోండి. ఒకవేళ నెంబర్ మారితే, వెంటనే అధికారిక వాహన్ పోర్టల్‌లోకి వెళ్లి మీ లేటెస్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఈ నెల రోజుల్లోనే ఈ చిన్న పనిని పూర్తి చేసుకొని ప్రశాంతంగా ఉండండి!
http://www.teluguone.com/news/content/vahan-database-mobile-number-update-telangana-36-221631.html





