అమెరికా పౌరసత్వం ఇక అందని ద్రాక్షేనా?

Publish Date:Jun 23, 2026

Advertisement

అమెరికాలో  స్థిరపడి ఆ దేశ పౌరసత్వం సాధించాలనుకునే వలసదారుల కలలు నెరవేరడం ఇక కష్ట సాధ్యమే. అమెరికా   ప్రభుత్వం  యూఎస్ సిటిజన్‌షిప్ దరఖాస్తు ఫీజులను రికార్డు స్థాయిలో పెంచేందుకు  కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే, అమెరికా పౌరసత్వం పొందడం సాధారణ వలసదారులకు దాదాపు అసాధ్యమే. . ఈ కొత్త ముసాయిదా నిబంధనను ఫెడరల్ రిజిస్టర్‌లో అధికారికంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం సోమవారం (జూన్ 22) విడుదల చేశారు. పౌరసత్వ దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అవుతున్న పూర్తి ఖర్చులను రాబట్టుకోవడమే లక్ష్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.

ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన కఠినమైన స్క్రీనింగ్ విధానాలు,    భద్రతా తనిఖీలకు అయ్యే అదనపు వ్యయాన్ని కూడా ఈ ఫీజుల ద్వారానే భర్తీ చేయాలని అమెరికా ప్రభుత్వం  భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, పేపర్ ఫైలింగ్ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక వ్యక్తి 760 డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 71,940 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ ఫీజును ఏకంగా 1,330 డాలర్లకు పెంచనున్నారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా  లక్షా పాతిక వేల,895 రూపాయలు అన్నమాట. కేవలం ఒక్క దరఖాస్తుపైనే దాదాపు 570 డాలర్లు అంటే రమారమి 75 శాతం అదనపు భారం పడనుంది.

 ఒకవేళ ఏదైనా కారణం చేత దరఖాస్తు తిరస్కరణకు గురైతే..  అప్పీల్ బోర్డు ముందు పునఃపరిశీలన కోసం వేసే అభ్యర్థన ఫీజును కూడా అమెరికా ప్రభుత్వం భారీగా పెంచేసింది. ప్రస్తుతం 830 డాలర్లుగా (సుమారు రూ. 78,566) ఉన్న ఈ అప్పీల్ ఫీజును ఏకంగా లక్షా 475 డాలర్లకు అంటే.. లక్షా 39 వేల 620రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. ఇది దాదాపు 77.7 శాతంపెంపు అన్నమాట. ఈ భారీ ఫీజుల పెంపును డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు  సమర్థించుకుంటున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అవుతున్న వాస్తవ ఖర్చులను ఏమాత్రం భరించలేకపోతున్నాయని, ఒక వలసదారునికి లభించే అత్యంత విలువైన ప్రయోజనం పౌరసత్వమేనని వారు అంటున్నారు. 

అయితే.. ఈ సంస్కరణలపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు, శాశ్వత నివాసితులపై ఈ నిర్ణయం కోలుకోలేని దెబ్బ కొడుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తక్కువ,  మధ్యతరగతి ఆదాయ వర్గాలకు అమెరికా పౌరసత్వం ఇకపై అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పౌరసత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా వలసదారులు ఆర్థికంగా వేగంగా ఎదగడానికి, పౌర భాగస్వామ్యంలో చురుగ్గా పాల్గొనడానికి గతంలో అమెరికా ప్రాధాన్యత ఇచ్చేదని, కానీ ప్రస్తుత నిర్ణయం ఆ ఆశయాలకు గండి కొట్టేలా ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ మాజీ అధికారులు సైతం విమర్శిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం వెలువడనుంది.

By
en-us Political News

  
లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయ టకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీ పంలోని ఆస్పత్రులకు తర లించి చికిత్స అందిస్తు న్నారు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో రోజుకు రూ.100 చొప్పున నెలసరి రూ.3000 పొదుపు చేయడం ద్వారా 6.7% వడ్డీతో ఐదేళ్లలో రూ.2.14 లక్షల కంటే ఎక్కువ మెచ్యూరిటీ మొత్తాన్ని ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పాన్-ఆధార్ కార్డుల లింకింగ్ గడువు ముగిసింది. రూ. 1,000 జరిమానాతో ఆన్‌లైన్‌లో మీ అకౌంట్ యాక్టివేట్ చేసుకోండి. లేదంటే 20% టీడీఎస్ కట్ అవుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూన్ 23 మంగళవారం నాడు దేశీయంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి రేట్లు ఎంత తగ్గాయో మరియు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో నేటి లేటెస్ట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
అమెరికా ప్రభుత్వ భూముల్లో చమురు, గ్యాస్ తవ్వకాలు జరిపే సంస్థల ఖర్చులను భారీగా తగ్గిస్తూ ట్రంప్ సర్కార్ సంచలన ప్రతిపాదనలు చేసింది. బాండ్ల ధరలను భారీగా తగ్గించడంతో పాటు పర్మిట్ల గడువును కుదించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ ఆసియా సంయుక్త అధిపతిగా హరి గోపాలకృష్ణన్ నియమితులయ్యారు. భారత్‌లో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ప్రైవేట్ ఈక్విటీ వృద్ధిపై ఈక్యూటీ సరికొత్త వ్యూహాలు మరియు గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
చాట్‌జీపీటీ మేకర్ OpenAIతో గెట్టి ఇమేజెస్ (Getty Images) చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భారీ మల్టీ-ఇయర్ డీల్ ప్రభావంతో గెట్టి ఇమేజెస్ స్టాక్ ఒక్కసారిగా 145 శాతం పైగా పెరిగి రికార్డు సృష్టించింది. ఈ ఆసక్తికరమైన బిజినెస్ సక్సెస్ స్టోరీ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆయిల్ పామ్ సాగుపై 44 శాతం దిగుమతి సుంకం పునరుద్ధరణ, రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ యూరియా పూర్తి కేటాయింపులతో పాటు తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి శ్రీధర్ బాబు జరిపిన కీలక భేటీ వివరాలు.
అమెరికా మరియు ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందంతో ఇరాన్ చమురుపై ఆంక్షలను 66 రోజుల పాటు అమెరికా తాత్కాలికంగా ఎత్తివేసింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గి భారత్ వంటి దేశాలకు భారీ ఉపశమనం లభించనుంది.
టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ చివరి రోజుకు చేరింది. రూ. 882.67 కోట్ల విలువైన ఈ మెయిన్‌బోర్డ్ ఐపీఓ ధర, తాజా జీఎమ్‌పీ, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ మరియు బ్రోకరేజ్ సంస్థల సలహాల పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మరియు కత్తెదాన్ రూట్లలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు GHMC రూ. 345 కోట్లతో భారీ సిక్స్-లేన్ కారిడార్‌ను ప్లాన్ చేసింది. 24 నెలల్లో పూర్తి కానున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు మీకోసం.
ప్రభుత్వ గ్రంథాలయాలలో పిల్లల పుస్తకాలను పెద్దల విభాగానికి మారుస్తున్న ఆందోళనకర ధోరణిపై ప్రత్యేక విశ్లేషణ. నిధుల ఆంక్షలు, తగ్గిపోతున్న పఠన నైపుణ్యాల వెనుక ఉన్న అసలు నిజాలు ఇక్కడ చదవండి.
అమెరికా బిగ్ టెక్ సేవలను ఉపయోగించే వ్యాపారాలను బహిష్కరించేందుకు యూరప్ వినియోగదారులు సిద్ధమవుతున్నారు. డేటా ప్రైవసీ, డిజిటల్ సార్వభౌమాధికారం కోసం వారు తీసుకున్న సంచలన నిర్ణయం మరియు తాజా సర్వే వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.