యూపీకి సీఎం అయినా అమ్మకూచే!

Publish Date:Jun 18, 2024

Advertisement

అమ్మ చిన్నతనంలో కొంగున ముడి వేసుకున్న చిల్లర డబ్బులను కొడుకు చేతిలో పెట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో బాబూ అని చెబుతుంది. అటువంటి తల్లిని కుమారుడు పెద్దయ్యాకా నెత్తిన పెట్టి చూసుకుంటారు. అయితే రాజకీయాలలో తల్లి, చెల్లి కాదు, అధికారం, ఆధిపత్యం ఇవే రాజ్యమేలుతాయి. 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో అదే జరిగింది. తన కోసం, తాను రాజకీయంగా ఉన్నతంగా ఎదగడం కోసం అహర్నిశలూ కృషి చేసిన తల్లినీ చెల్లినీ జగన్ రాష్ట్రం దాటించేశారు. తన అధికారం స్వార్జితమనీ, అందులో మీకు భాగం లేదనీ తన చేతల ద్వారా విస్పష్టంగా చెప్పేశారు. చెల్లిని ముందే గెంటేసిన జగన్ పార్టీ ప్లీనరీ వేదికగా అమ్మ చేత వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. పార్టీతో అప్పటి వరకూ ఉన్న బంధాన్ని పుటుక్కున తెంచేశారు. ఇది ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు అయితే...

దేశంలోనే అతి  పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ది మరో తీరు. ఆయనకు అమ్మమీద అపారమైన ప్రేమాభిమానాలున్నాయి. అయితే కుమారుడి అధికారం, హోదా, పదవి కారణంగా వచ్చే ఏ సౌకర్యమూ తనకు వద్దనుకుంది యోగి తల్లి. ఎందుకంటే కాషాయ వస్త్రధారుడైన తన కుమారుడికి తాను బలహీనతగా మారకూడదని తలచిందా తల్లి..  ఎందుకంటే కుటుంబ బంధాలు లేని ‘యోగి’ ఆదిత్యనాథ్ ది నిరాడంబర జీవనశైలి. దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆయనది మితాహారమే. పవళింపు నేలమీదే.

కుమారుడి బాటలోనే ఆయన తల్లీ నడుస్తున్నారు. తనయుడు ముఖ్యమంత్రి అయినా ఆమె తన రెక్కలకష్టంతోనే బతుకుతున్న పేదరాలు. వారిరువురూ తాజాగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. అదెక్కడంటే.. రుద్రప్రయాగ్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు రిషికేష్ లోని ఎయిమ్స్ కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సావిత్రీదేవిని చూసి నిర్ఘాంత పోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. తనను చూసి కరిగి కన్నీరైన కుమారుడిని ఆ తల్లే ఓదార్చింది. క్షేమ సమాచారం కనుక్కుంది. వేళకు తింటున్నావా నాయనా అని ఆరా తీసింది.  యోగి తన తల్లిని చూడడం రెండేళ్ల తరువాత ఇదే మొదటి సారి.  తల్లికి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెనుదిరిగి వెడుతున్న యోగి ఆదిత్యనాథ్ ను చేయి పట్టి ఆపి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో బాబూ అంటూ పదివేల రూపాయలను కుమారుడికి ఇచ్చిందా తల్లి. అమ్మ ఇచ్చిన సొమ్మును కళ్లకద్దుకుని జాగ్రత్తగా జేబుతో పెట్టుకున్న యోగి ఆదిత్యనాథ్ ఆమె కాళ్లకు నమస్కరించి కన్నీటితో వెనుదిరిగారు. అనుబంధాలు, ఆప్యాయతలకు నిలువెత్తు నిదర్శనంగా  నిలిచిన ఈ దృశ్యం అక్కడి వారందరినీ కదిలించేసింది.  

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.