Publish Date:Aug 16, 2023
మంగళగిరిలో లోకేష్ ఎంట్రీయే అదిరిపోయింది. తొలి సారిగా అసెంబ్లీకి ఆయన పోటీ చేసింది మంగళగిరి నుంచే.. తొలి ప్రయత్నంలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి నుంచి ఆయన ఓ అజేయ శక్తిగా ఎదిగారనడానికి యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు ఆయనకు జనం నీరాజనాలు పలికిన తీరు కళ్లకు కట్టింది. లోకేష్ ను నియోజకవర్గానికి దూరం చేయడానికి జగన్ సర్కార్, ఆయన పార్టీ చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహం లేదు. ఒటమి పెంచిన కసితో, పట్టుదలతో ఆయన నియోజకవర్గంలో ప్రణాళికాబద్దంగా పని చేసుకుంటూ వచ్చారు.
నిత్యం అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. ఆ ఎఫెక్ట్ పాదయాత్రలో అడుగడుగునా కనిపించింది. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని, లోకేష్ ను బలహీనం చేసేందుకు అధికార బలంతో నియోజకవర్గ స్థాయినేతల్ని జగన్ రెడ్డి వైసీపీలో చేర్చుకున్నారు. నిత్యం వేధింపులతో తెలుగుదేశం శ్రేణులను నిర్వీర్యం చేయడానికి శతథా ప్రయత్నించారు. అయితే ఎంత బలంగా అణచివేయడానికి ప్రయత్నిస్తే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో లోకేష్ నాయకత్వంలోని తెలుగుదేశం శ్రేణులు నియోజకవర్గంలో బలం పుంజుకున్నాయి. దానికి తోడు లోకేష్ పని తీరు, పరిపక్వతతో కూడిన రాజకీయాలు ప్రజలలో ఆయన పట్ల అభిమానం పెరిగేలా చేశాయి. దీంతో లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టే సరికి మొత్తం నియోజకవర్గం అంతా ఆయన వెంట నడిచిందా అన్నట్లుగా జనం పోటెత్తారు. వీరికితోడు గుంటూరు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన వారు కూడా ఉత్సాహంగా లోకేష్ పాదయాత్రలో ఆయనతో అడుగుకలిపి నడిచారు.
ఆయన పాదయాత్రకు పోటెత్తిన జనం అసంఖ్యాకం అనడానికి మూడు నాలుగు కిలోమీటర్ల నడకకే ఆరున్నర గంటలకు పైగా సమయం పట్టడాన్ని తెలుస్తున్నది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వరకూ లోకేష్ మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగానే తన కార్యకలాపాలన్నీ సాగించారు. 2019 ఎన్నికలలో ఎక్కడ వైసీపీ పై చేయి సాధించిందో అక్కడే తనపై అభిమానం వెల్లువెత్తేలా వ్యూహాత్మకంగా పని చేశారు. క్షేత్ర స్థాయిలో నియోజకవర్గ సమస్యలను గుర్తించి, అడ్రస్ చేసి వాటి పరిష్కారం కోసం పని చేశారు. అదే సమయంలో గత ఎన్నికలలో మంగళగిరి నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నిష్క్రియాపరత్వం వల్ల ప్రజలకు దూరం అయ్యారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకున్నది లేదు.
దీంతో ప్రజలలో ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దానికి తోడు జగన్ సర్కార్ విధానాల పట్ల సహజంగానే పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు వెరసి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పట్ల అభిమానం, ఆయన తమకు అండగా ఉంటాడన్న విశ్వాసం అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది. మంగళగిరిలో లోకేష్ జోరు కు.. ఎలా అడ్డుకట్ట వేయాలో ఐ ప్యాక్ టీమ్‌కూ అర్థం కావడం లేదు. మంచి చేసి.. ప్రజల అభిమానాన్ని గెలుచుకోవాలన్న ధ్యేయంతో లోకేష్ వేసిన అడుగులు ఇప్పడు ఆయనకు జనం బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/unprecedented-acceptance-to-lokesh-in-mangalagiri-39-160058.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.