చంద్ర‌బాబు ఫోన్ చూసి కేంద్ర మంత్రి ఫిదా

Publish Date:Apr 29, 2026

Advertisement

గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ఓ ఆసక్తికరమైన‌ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు ఫోన్ తీసుకుని.. బాగుంది ఏ మోడల్? అని ఆరా తీశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కొద్దిసేపు ఆ ఫోన్ ను తీక్షణంగా చూశారు కేంద్ర మంత్రి. కాగా అది ఫోల్డబుల్ ఫోన్. ఇప్పుడంద‌రి చూపు ఈ ఫోన్ వైపు మ‌ళ్ల‌ింది. అస‌లు చంద్ర‌బాబు వాడే మోడ్ర‌న్ గాడ్జెట్స్ ఏవి?  వాటి వివ‌రాలు ఎంటి?  తొలి  నుంచీ చంద్ర‌బాబుకున్న ఈ హైటెక్ హాబిటేష‌న్ ఏంటి? ఆ డీటైల్స్ ఏంటి? అన్న డిబేట్ మొద‌లైంది.

చంద్రబాబు నాయుడుకు హైటెక్ అనే పేరు ఊరికే రాలేదు. 90వ దశకంలోనే ఐటి ప్రాధాన్యతను గుర్తించి, చేతిలో ఒక  పామ్ టాప్ పట్టుకుని తిరుగుతూ అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్ర‌బాబు. తాజాగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన ఫోన్ చూసి ఆశ్చర్యపోవడం, బాబు గారి అప్‌డేటెడ్ లైఫ్‌స్టైల్‌కు మరో నిదర్శనంగా చెబుతారు.

చంద్రబాబు వాడే ఆధునిక గాడ్జెట్లు.. వాటి వివరాలు.. చంద్రబాబు ప్ర‌స్తుతం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ ఫోన్‌ను వాడుతున్నారు. అందులోనూ.. లేటెస్ట్ మోడ‌ల్.  ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి, విప్పినప్పుడు ఒక చిన్న టాబ్లెట్‌లా మారుతుంది.

దీని ఉపయోగం ఏంటో చూస్తే.. ఆయన నిరంతరం ఫైల్స్ చదవడం, డాష్ బోర్డులు పరిశీలించడం, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వంటివి చేస్తుంటారు. పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల.. డేటా విశ్లేషణకు ఇది ఆయనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. కేంద్ర‌మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ ఫోన్ చూసి ఆరా తీయడానికి కారణం దాని డిజైన్, బాబు గారు ఈ వయసులో కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతుండటమే.

చంద్రబాబు వద్ద గ‌ల‌ ఇతర మోడ్రన్ గాడ్జెట్స్ ఏంట‌ని ప‌రిశీలిస్తే..  తన వెంట ఎప్పుడూ ఒక యాపిల్ ఐప్యాడ్ ఉంచుకుంటారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక గణాంకాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడానికి అంటే, హార్ట్ రేట్, స్టెప్ కౌంట్ వంటివి  ఆయన టాప్ ఎండ్ స్మార్ట్ వాచ్‌లను ధరిస్తుంటారు. ఆయన వాడే డివైజ్‌లలో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు ఉంటాయి. దీని ద్వారా ఏ జిల్లాలో ఏ పథకం ఎలా అమలవుతుందో ఆయన వేలిముద్రతో తెలుసుకోగలరు.

చంద్రబాబుకు టెక్నాలజీపై ఉన్న మక్కువ ఈనాటిది కాదు.  తొలి నుంచీ ఆయ‌న‌ హైటెక్ హాబిటేషన్ కి చాలా పెద్ద హిస్ట‌రీయే ఉంది. అదొక ప్ర‌స్తానం. 1995-2004 మధ్య కాలంలోనే ఆయన క్యాసియో లేదా హెచ్ పీ పామ్ టాప్స్ వాడేవారు. అప్పట్లో కంప్యూటర్ల గురించి పెద్దగా తెలియని రోజుల్లోనే ఆయన డిజిటల్ డైరీలను మెయింటైన్ చేసేవారు. స్మార్ట్ ఫోన్ల విప్లవం రాకముందు ఆయన బ్లాక్ బెర్రీ ఫోన్లకు పెద్ద ఫ్యాన్. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా అప్పట్లో అదే అత్యుత్తమ ఫోన్. దేశంలోనే మొట్టమొదటిసారిగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఘనత ఆయనదే.

బాబు గారి టెక్నాలజీ వెనుక ఉద్దేశం ఏంటి? అని విశ్లేషిస్తే.. ఇది కేవలం స్టైల్ కోసం కాదు, ఒక ఎఫిషియ‌న్సీ కోసం ఆయ‌న ఎక్కువ‌గా టెక్నాలజీని వాడుతారు. అంటే ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు నిఖార్స‌యిన స‌మ‌ర్ధ‌వంత‌మైన సేవ‌లందించ‌డానికే ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం త‌న‌కు అత్య‌వ‌స‌రంగా భావిస్తారాయ‌న‌.  పేపర్ లెస్ గవర్నెన్స్ ఆయ‌న అడ్మినిస్ట్రేటివ్ పాల‌సీ. వీలైనంత వరకు ఫైళ్లు డిజిటల్ రూపంలో ఉండాలని కోరుకుంటారు చంద్ర‌బాబు.  భావోద్వేగాల కంటే, గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన శైలి.

కేంద్ర ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఒక ఇంజనీర్, ఇక‌ టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తినే చంద్రబాబు తన ఫోన్‌తో ఆకర్షించారంటే, 70 ఏళ్ల పైబ‌డ్డ‌ వయసులో కూడా ఆయన ఎంత యంగ్ అండ్ అప్‌డేటెడ్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే  బాబు గారికి గాడ్జెట్స్ అంటే కేవలం వస్తువులు కావు, అవి ఆయన పనిని వేగవంతం చేసే ఆయుధాలు. కాబ‌ట్టి టెక్నాల‌జీ+ అడ్మినిస్ట్రేష‌న్ కి లేటెస్ట్ వ‌ర్షెన్ చంద్ర‌బాబు అని చెప్పాల్సి ఉంటుంద‌ని అంటారు సాంకేతిక నిపుణులు.

By
en-us Political News

  
బెంగళూరు నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అతలాకుతలం చేసింది.
ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
చిత్రవిచిత్రమైన కేసులు, క్లయింట్ల మొండి వైఖరితో న్యాయమూర్తులు ఎంతవరకు విసుగుచెందుతారో చూపించే ఆసక్తికర సంఘటన ఇది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది.
కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే నేను ఈ స్థాయికి చేరుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఓటర్ల ఉత్సాహంతో ఊగిపోయింది
ఏపీ సీఎస్ జి. సాయిప్రసాద్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేస్తూ హల్‌చల్ సృష్టించిన సూడో పోలీసును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
సీఎం రేవంత్‌ను కలిసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.