గత రెండు రోజులుగా కేఏ పాల్ తెలంగాణలో చేస్తున్న హల్ చల్ కు మీడియాలో ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తున్నది. దీని వెనుక కేసీఆర్ స్కెచ్ ఉన్నదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు కేఏ పాల్ కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏం మాట్లాడినా సీరియస్ గా తీసుకునే వారెవరూ లేరు. గత ఎన్నికల ముందు కూడా ఆయన చేసిన హడావుడి సీరియస్ నెస్ లేని రాజకీయ కామెడీగానే మిగిలిపోయింది. అయితే గత రెండు రోజులుగా మాత్రం పాల్ చుట్టూ మీడియా తిరగడం.. ప్రాధాన్యత ఇవ్వడం అనుమానాలకు తావిస్తున్నది. ఆయనపై దాడి జరగడమేమిటి? ఆ దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి బయలు దేరిన ఆయనను హౌస్ అరెస్టు చేయడమేమిటి అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.
\ఈ సంఘటనలకు కొద్ది రోజుల ముందు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసందర్భంగా కేఏ పాల్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఒకింత వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్లుగా రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం కేఏ పాల్ అని చెప్పుకొచ్చారు. అప్పట్లో కేటీఆర్ మాటలను అంతా జోక్ గానే తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లను పలుచన చేసే ఉద్దేశంతో చెప్పిన మాటలుగా పరిగణించారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో కేఏపాల్ కు ఆయన హడావుడికి తెరాస ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే...మొత్తం కేసీఆర్ స్కెచ్ ప్రకారమే జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు బలం తగ్గిందని ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఓటమి గండం నుంచి బయటపడడానికి కేసీఆర్ వేసిన స్కెచ్ లో బాగంగానే కేఏ పాల్ ఎంట్రీ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ర్టంలో త్రిముఖ పోరు అనివార్యమన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంతే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పుంజుకుంటున్నాయి. వాటిని నిలువరించకుంటే మూడో సారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ కల సాకారం అవ్వడం కష్టసాధ్యమని పీకే నివేదిక స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్ కేఏపాల్ ను రంగంలోనికి దింపారని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ లో రాహుల్ గాంధీతో రైతు సంఘర్షణ సభ సన్నాహాలలో కాంగ్రెస్ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు బలోపేతమయ్యేందుకు సన్నాహాలలో నిమగ్నమయ్యాయి.
ఏలాగైనా అధికారం నిలుపుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ కేఏ పాల్ తమకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అని కేటీఆర్ తో చెప్పించి ఆయన ఎంట్రీకి తలుపులు తెరిచారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్, కేటీఆర్ లు ప్రస్తావించేంత స్థాయి కేఏ పాల్ కు గానీ, ఆయన పార్టీకి కానీ లేదు. కేఏ పాల్ పై దాడి, హౌస్ అరెస్టు వంటి ఘటనల ద్వారా ఆయనకు లేని ప్రాధాన్యాన్నికల్పించి రాష్ట్రంలో రాజకీయ కన్ఫ్యూజన్ తీసుకువచ్చి లబ్ధి పొందాలన్నదే కేసీఆర్ స్కెచ్ లా కనిపిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/un-necessary-importance-to-ka-paul-kcr-scketch-25-135425.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.