Publish Date:Jun 20, 2022
జగన్ సర్కార్ లో మేకలను బలిపశువులను చేస్తున్నారు. పై స్థాయిలో జరిగిన తప్పులకు కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారు. తాజాగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అదే జరిగింది. కోర్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. అందుకు బాధ్యులను చేస్తూ ఇద్దరు కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేశారు.
మరో అధికారికి చార్జి మెమో ఇచ్చారు. అసలు విషయమేమిటంటే ఉపాధి పనుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై కోర్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లులు చెల్లించకుంటే ఎలా అని నిలదీసింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో ఈ నెల 14న కోర్టుకు హాజరైన గోపాలకృష్ణ ద్వివేదిపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే.
హై కోర్టుర ఆదేశించినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించరా అంటూ నిలదీసింది. కాగా బిల్లుల చెల్లింపులో జాప్యానికి కారణంగా చూపుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం పంచాయతీరాజ్ డివిజన్ ఎఈ రమేష్ బాబు, డివిజనల్ అక్కౌంట్స్ అధికారి వీపీ సుబ్బారావులపై గోపాలకృష్ణ ద్వివేది సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే డీఈఈ కే. ఆదినారాయణకు చార్జి మెమో ఇచ్చారు. పిటిషనర్ పూర్తి చేసిన రోడ్డు పనిపై తొలుత క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీ చేసి, నాణ్యత లోపం ఉందంటూ రికవరీ పెట్టిన విషయాన్ని ప్రస్తావించకపోవడానికి, ఇంజినీర్లు సమాచారం ఇవ్వకపోవడమే కారణమని ముఖ్య కార్యదర్శి నిర్ధారణకు వచ్చి, వీరి కారణంగా హైకోర్టులో ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు, ప్రతికూల వ్యాఖ్యలు ఎదుర్కొన్నామని ఆ సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
కాగా ఇరువురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ వెలువరించిన జీవో శనివారం వెలుగులోనికి వచ్చింది. ఉపాధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై, హైకోర్టు ఆయనపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాఖా పరంగా ఇటువంటి తీవ్ర చర్యలు తీసుకోవడంపై సంబంధిత వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రతికూల పరిస్థితుల్లో, తీవ్రమైన ఒత్తిడితో పని చేస్తున్న ఇంజినీర్లను చేయని తప్పునకు బలిపశువులను చేస్తున్నారని ఇంజినీర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సస్పెన్షన్లను తక్షణం ఎత్తివేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ మురళీకృష్ణనాయుడు డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-panchayatraj-engineers-suspended-for-delay-in-payments-for-contractor-25-138037.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.