విజయ్ సర్కార్ తొలి బడ్జెట్.. సర్వత్రా ఆసక్తి.!

Publish Date:Aug 4, 2026

Advertisement

తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం బుధవారం తన  తొలి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రి మేరీ విల్సన్ బుధవారం ( ఆగస్టు5) సభలో ప్రవేశపెట్టనున్నారు.  కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సమర్పిస్తున్న తొలి బడ్జెట్ కావడంతో.. ప్రభుత్వ   ప్రాధాన్యతలు, కొత్త పథకాలు, పాలనా  సంస్కరణలపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.  

రాష్ట్రం ఎదుర్కొంటున్న  ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన  హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య  సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం భారీ నిధులు వెచ్చించాల్సిన నూతన సంక్షేమ పథకాల ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పటివరకు అధికారికంగా అమలు చేస్తున్న  తైమామన్ తంగ మోదిరం' పథకం తప్ప, ఇతర పెద్ద పథకాల ప్రకటనలేవీ వెలువడలేదు.   ఈ తొలి బడ్జెట్‌లో సామాన్య ప్రజలను ఆకట్టుకునేలా కొన్ని కొత్త పథకాలతో పాటు, సేవా రంగాన్ని బలోపేతం చేసే కీలక పాలనా సంస్కరణలను ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.

 ప్రజలపై అదనపు పన్నుల భారం వేయకుండా ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడంపై ప్రభుత్వం   దృష్టి సారించింది. అనవసర వ్యయాలను తగ్గించుకుంటూ, ఆదాయ సేకరణను మెరుగుపరచడం ద్వారా ఆర్థిక లోటును పూడ్చాలని భావిస్తోంది. ప్రజా సేవలను మరింత వేగవంతం చేయడం, పారదర్శకతను పెంచడం ద్వారా పాలనా వ్యవస్థలో   మార్పులు తీసుకురావడానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే  బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో శాసనసభ నిర్వహణ, బడ్జెట్‌పై చర్చలకు కేటాయించే వ్యవధి,  సంబంధిత షెడ్యూల్‌  ఖరారు చేయనున్నారు.   మొత్తానికి, టీవీకే ప్రభుత్వం తన తొలి వార్షిక బడ్జెట్ ద్వారా ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నది తమిళనాటే కాకుండా, దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది.  

TVK Budget 2026, Tamil Nadu First Budget, Mary Wilson TVK, Thaimaman Thanga Mothiram Scheme, Tamil Nadu

By
en-us Political News

  
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.