విశ్వమంతా యోగా జపం .. టీటీడీలో మౌనవ్రతం! జగన్ రెడ్డికి పట్టదా.. ?

Publish Date:Jun 22, 2021

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) హిందూ ధార్మిక సంస్థ. హిందూ ధర్మాన్ని, భారతీయ సంప్రదాయాలు విలువలు,ఆచార వ్యవహారాలను పరిరక్షించడం సంస్థ ప్రధాన కర్తవ్యం. టీటీడీ సభ్యులు, సిబ్బంది హిందూ ధార్మిక విలువలను, భారతీయ సంప్రదాయాలను తూ.చతప్పక పాటించే వారై ఉంటారని, ఉండాలని హిందూ సమాజం కోరుకుంటుంది. అది సహజం. ఎందుకంటే, ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి పైసా, వివిధ రూపాల్లో భక్తులు స్వామి వారికి సమర్పించుకున్నకానుకల ద్వారా వచ్చిన సొమ్ములే. నిజానికి, టీటీడీకి ప్రభుత్వం నుంచి పైసా నిధులు రావు. ప్రభుత్వమే దేవస్థానం నిధులను, ప్రజా ప్రయోజనాలు, సంక్షేమం పేరున దారి మళ్ళించి, అన్య మత ప్రచారకులకు సైతం వినియోగిస్తున్నారనే, పాస్టర్లకు  పందారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ వ్యవహారాల్లో అన్యమత జోక్యం అధికం అవుతోందన్న ఆరోపణలున్నాయి. 

టీటీడీ పరిధిలోని, సప్తగిరి పత్రిక, శ్రీ వెంకటేశ్వరభక్తి చానల్ ఇతర ధార్మిక ప్రచార సంస్థలు తరచూ  వార్తలో తేలుతున్నాయి. అయితే, అలా వార్తలకెక్కిన ప్రతి సందర్భం, హిందువులు తల వంచుకునేలా చేస్తోంది    హిందూ ధర్మ ప్రచారం కోసం నడుపుతున్న సప్తగిరి పత్రికలో, అలవాటుగానో , గ్రహపాటుగానో హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారం జరిగిన ఆరోపణలున్నాయి. అలాగే   క్రైస్తవ మత  ప్రచారం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.  క్రైస్తవ గీతాలు ప్రచిరించడం, సప్తగిరి పత్రికకు అనుబంధంగా  క్రైస్తవ ప్రచార బుక్ లెట్’ను జత చేయడం వంటి అపచారాలు అనేకం వెలుగు చూశాయి. అలాగే  అయోధ్య రామాలయం భూమిపూజ కార్యక్రమాన్ని దేశంలోని ప్రైవేటు టీవీ చానల్స్ సహా అన్ని చానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. కానీ, టీటీడీ ఆధ్వర్యంలోని  శ్రీ వెంకటేశ్వర భక్తీ చానల్,  ఎస్వీబీసీ చానల్ మాత్రం  ప్రసారం చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇలాంటి అపచారలు అనేక జరుగుతూనే ఉన్నాయి. 

ఇప్పడు ఇదే కోవకుచెందిన మరో దురాగతం, ప్రపంచం అంతటా జరుపుకున్న ప్రపంచ యో దినోత్సవాన్ని టీటీడీ పూర్తిగా విస్మరించింది.యోగా దినోత్సవం హిందూ ధార్మిక వేడుక కాదు,కానీ, హిందూ ధర్మంతో, భారతీయతతో  ముడిపడిన,ప్రతి భారతీయడు, ప్రత్యేకించి ప్రతి హిందువు గర్వించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని ఉపేక్షించడం క్షతవ్యం కాదని, యోగా సంస్థలు అక్షేపిస్తున్నాయి. అంతే కాదు, ఇదేదో పొరపాటున జరిగింది కాదు. ఉద్దేశ పూర్వకంగానే జరిగిందని, వ్యవహారం పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తినేసింది’ అన్నట్లుగా టీటీడీ వ్యవహారం ఉందని ధార్మిక సంస్థలు మరో మారు అక్షేపిస్తున్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా సోమవారం యోగ దినోత్సవాన్ని నిర్వహించినా, టీటీడీలో మాత్రం ఆ ఊసే కనిపించలేదు. టిటిడి విద్యాసంస్థలలో కూడా  యోగా దినోత్సవం జరిపిన దాఖలాలు లేవు.  గతంలో టీటీడీ ఆధ్వర్యంలో యోగా నేర్పించే విద్యా సంస్థ ఉండేది. డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు ఇచ్చేవారు. నిత్యం యోగ సాధన చేసే వారి కోసం పాత మెటర్నిటీలో హాల్‌ను కూడా కేటాయించేవారు.  అనంతరం టీటీడీ విద్యాశాఖ పరిధిలోని యోగా సంస్థను ఆయుర్వేద కళాశాల పరిధిలోకి తెచ్చింది. రెండేళ్ల కిందటి వరకు సంస్కృత విద్యాపీఠంతో కలిసి టీటీడీ యోగా దినోత్సవాన్ని ఓ ఉత్సవంలా నిర్వహించేది.  కావచ్చును, కొవిడ్ కారణంగా, గతంలో లాగా కార్యక్రమాన్ని నిర్వహించక పోవడాన్ని అర్ధం చేసుకోవచ్చును,కానీ, ఈ విధంగా పూర్తిగా విస్మరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత రెండేళ్లుగా  యోగా దినోత్సవాన్ని టీటీడీ నిర్లక్ష్యం చేసింది. సనాతన ధర్మంలో ఎంతో కీలకమైన యోగాను టీటీడీ లాంటి ధార్మికసంస్థ పట్టించుకోక పోవటం చర్చనీయాంశంగా మారింది. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,పాలనలో టిటిడిలో అన్యమతస్థుల ప్రాబల్యం పెరుగుతున్నదని ఆరోపణలకు తోడు,తరచూ చోటు చేసుకుంటున్న ఇలాంటి దురగాలు, టీటీడీలో జరుగతున్న హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రభుత్వ మద్దతు ప్రోత్సం ఉందనే అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. టిటిడిలో పనిచేస్తున్న అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించడం పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా  వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ఇటువంటి సమయంలో యోగా దినోత్సవంను పట్టించుకొనక పోవడం ప్రభుత్వ ధోరణిని వెల్లడి చేస్తున్నది.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.