భక్తుల సౌకర్యాల విషయంలో నో కాంప్రమైజ్.. టీటీడీ అదనపు ఈవో ఆకస్మిక తనిఖీ

Publish Date:Aug 24, 2024

Advertisement

తిరుమల ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం అస్సలు రాజీపడటం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకంపై ఒక పక్క కసరత్తు జరుపుతూనే  తిరుమల పవిత్రత, పారిశుద్ధ్యం, భక్తులకు నాణ్యమైన సేవలు వంటి విషయాలలో అలసత్వం కూడదన్న ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు తిరుమలలో వరుస తనిఖీలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శనివారం (ఆగస్టు 24) తెల్లవారు జామున తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కృష్ణ తేజ సర్కిల్, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, క్యూలైన్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా భక్తులతో ముచ్చటించారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను వారికి వివరించారు. కంపార్ట్ మెంట్లలో టీటీడీ అందిస్తున్న ఉప్మా నాణ్యత గురించి ఆరా తీశారు.   అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తాగునీరు, అన్న‌ప్ర‌సాదాలు, పాలు అందించే విధానాన్ని పరిశీలించి, కంపార్ట్మెంట్ల వెలుపల ఉన్న బోర్డులపై భక్తులకు అందించే ఆహార పానీయాలు, సమయాలను పేర్కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  కంపార్ట్మెంట్లను నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలన్నారు. వీక్యుసి కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి పంపిన వెంటనే, మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

కృష్ణ తేజ సర్కిల్ వద్ద భక్తులు క్యూ లైన్ ల లోకి ప్రవేశించే మార్గాల వద్ద  కొందరు ప్రైవేటు టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా   పార్కింగ్ చేయడాన్ని గమనించి, డ్రైవర్లను హెచ్చరించారు. భవిష్యత్తులో ఐటువంటి అనధికారిక పార్కింగ్ నివారించేందుకు, స్థానిక పోలీసులతో చర్చలు జరపాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.  

By
en-us Political News

  
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.