Publish Date:Jul 30, 2025
తిరుమలలో శ్రీవాణి దర్శనం టికెట్లు ఇకపై ఏ రోజుకారోజు కేటాయించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇప్పటి వరకూ శ్రీవాణి టికెట్లతో దర్శనం చేసుకోవడానికి మూడు రోజులు గడువు ఇచ్చేవారు. కానీ ఆగస్టు ఒకటి నుంచి ఈ విధానాన్ని మార్చి ఏ రోజు శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుంటే ఆ రోజే దర్శనేం చేసుకోవలసి ఉంటుంది. ఈ నూనత విధానాన్ని ప్రయోగాత్మకంగా ఆగస్టు 1 నుంచి 15 వరకూ అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఆ తరువాత నవంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పేర్కొంది. ఈ నూతన విధానం భక్తులకు, ప్రత్యేకించి ఆఫ్ లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లు తీసుకునే వారికి సౌకర్యంగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్ లైన్ లో తీసుకునే వారి దర్శన సమయాల్లో కూడా మార్పులు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌరది తెలిపారు.
తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో ఆయన శ్రీవాణి దర్శనాలపై బుధవారం (జులై 30) సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానంలో తిరుమలలో ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్ల కౌంటర్లు తెరుస్తారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన టికెట్లు జారీ చేస్తారు. ఈ టికెట్లు పొందిన వారు అదే రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచీ దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకూ జారీ చేస్తారు.
తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800, రేణిగుంట విమానాశ్రయంలో 200 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తారు. కాగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబర్ 31వ తేది వరకు ఆన్ లైన్లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇకపోతే నవంబర్ 1వ తేదీ నుంచి మాత్రం ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం నాలుగున్నర గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-brings-new-policy-for-srivani-darshanam-39-203136.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.