టీటీడీ అంటే ఆ కుటుంబానికి ఎందుకంత దుర్మార్గ‌పు ఆలోచ‌న‌?

Publish Date:Nov 12, 2025

Advertisement

 

టీటీడీ మీద జ‌గ‌న్ ఫ్యామిలీ చేస్తున్న కుట్ర‌లు ఈనాటివి కావు. ఒక స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామిని అన‌రాని మాట‌లు అన్న  భూమ‌న  క‌రుణాక‌ర్ రెడ్డిని ఏకంగా టీటీడీ బోర్డు చైర్మ‌న్ గా నియ‌మించ‌డం ద‌గ్గ‌ర్నుంచి మొద‌లు పెడితే ఈ ప‌రంప‌ర కొన‌సాగుతూనే వ‌చ్చింది. 

ఆ త‌ర్వాత వెంక‌టేశ్వ‌ర‌స్వామికి  వ్య‌తిరేకంగా  పుస్త‌కాలు రాసిన‌ భూమ‌న సోద‌రుడు ఏకంగా శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ప్రారంభించడం అదో భ్ర‌ష్టాచారంగా చెబుతారు.

ధ‌ర్మారెడ్డిని టీటీడీ పాల‌న‌లో ప్ర‌వేశ పెట్టించి.. ఆయ‌న  చేత చేయించ‌ని అక్ర‌మాలు లేవ‌న‌డానికి ప‌ర‌కామ‌ణి, ఆపై ల‌డ్డూలో న‌కిలీ  నెయ్యి వ్య‌వ‌హారాలు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీవారికి వైయ‌స్ కుటుంబం  చేయ‌ని ద్రోహం లేదని అంటారు.

ఇటీవ‌ల మాట్లాడిన భూమ‌న త‌న వాళ్లు సుమారు ఐదు వేల మంది వ‌ర‌కూ టీటీడీలో పాతుకుపోయార‌నీ.. మీకు సంబంధించిన ఏ చిన్న ర‌హ‌స్య‌మైనా త‌న చేతికి వ‌చ్చేస్తుందంటూ ఆయ‌న మాట్లాడిన మాట‌లు ఒక సంచ‌ల‌నం. 

అంటే అన్ని  ర‌కాలుగా టీటీడీని ఆక్ర‌మించుకుని వారికి వారు దోచుకోడానికి పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక‌లు ర‌చించిన‌ట్టు క‌నిపిస్తోంది. ప‌ర‌కామ‌ణి వ్య‌వ‌హారమే చూస్కుంటే ధ‌ర్మారెడ్డి ద్వారా అప్ప‌ట్లో ఎస్టేట్ మేనేజ‌ర్ గా ఉన్న ఒక‌ వ్య‌క్తిని టీటీడీ అడిష‌న‌ల్ ఈవోగా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించి మ‌రీ ఈ స్కామ్ కి తెర‌లేపిన‌ట్టు గుర్తించారు సీఐడీ అధికారులు.

న‌కిలీ ల‌డ్డు వ్య‌వ‌హారం ఎంత ఘోర‌మంటే.. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీ కోసం భోలే బాబా డైరీ నుంచి 250 కోట్ల విలువైన 68 ల‌క్ష‌ల కేజీల నెయ్యి కొన్నారు. ఆ డైరీ 2019- 2024 మ‌ధ్య ఒక్క లీట‌ర్ పాలు కూడా సేక‌రించ‌లేదంటే  ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.

కొంద‌ర‌నే మాట‌ల‌ను అనుస‌రించి చెబితే.. జ‌గ‌న్ కుటుంబానికి టీటీడీ మీద అక్క‌సు ఈనాటిది  కాద‌ని.. ఇది ఆయ‌న తండ్రి వైయ‌స్ ఏడుకొండ‌ల వాడికి ఏడు కొండ‌లు ఎందుకు? రెండు కొండ‌లు మాత్ర‌మే స‌రిపోవా? అంటూ మొద‌లు పెట్టార‌నీ.

వైయ‌స్ పావురాల‌గుట్ట‌లో ప‌డి అనంత‌లోకాల‌కు చేరినా ఈ పులివెందుల మాఫియాకు టీటీడీ మీదున్న దుర్మార్గ‌పు ఆలోచ‌న‌లు పోలేదనీ.. అందుకే జ‌నాన్ని మ‌భ్య పెట్ట‌డానిక‌ని.. త‌న ఇంట్లో వెంక‌న్న సెట్ వేశార‌నీ.. ఈ బూట‌కాల  నాట‌కం గుర్తించ‌బ‌ట్టే వెంక‌న్న త‌న మూడు నామాల‌లోని రెండు నామాల‌ను బ‌హుమానంగా ఇచ్చార‌నీ చెప్పుకొస్తారు శ్రీవారి భ‌క్తులు.
 

By
en-us Political News

  
సగం రోడ్డు వేసి.. మిగతా సగం రోడ్డు వేయకుండా ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని విమర్శించారు. వారం రోజుల్లో రోడ్డు వేస్తారో లేదో తెలపాలనీ, లేని పక్షంలో సీఎం ఆఫీస్ కి వెళ్తామని హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం (20-04-2026) అగ్నిప్రమాదం సంభవించింది.
సాధారణంగా అరవై ఏళ్లు దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యం సహకరించదని బాధ్యతలను పక్కన పెట్టేస్తుంటారు.
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది.
పశ్చిమ జపాన్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప ధాటికి పలు భవనాలు కుప్పకూలినట్లు చెబుతున్నారు. భూకంపం తరువాత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం జపాన్ లోని ఇషికావా పరిధిలోని నోటో ద్వీపంలో సంభవించింది. దాదాపు నిముషం పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
దురాశ ఉంటే జడ్జిలుగా ఉండే అర్హత లేదు...జస్టిస్ నాగరత్న సంచలన వ్యాఖ్యలు
తనపై దాడి జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలనని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తూ.. ఈ జలసంధిని ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటోంది. ఈ విడత మూసివేత వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమవుతోందని రష్యా ముందస్తుగా ఇరాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం.
ఈ జలసంధి ప్రపంచ ఎనర్జీకి నాడి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20శాతం వరకు, ఈ సన్నని జలసంధి గుండా మాత్రమే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. దీని భౌగోళిక స్థానం చూస్తే.. ఒక వైపు ఇరాన్, మరో వైపు యూఏపీ. ఇది గల్ఫ్ నుంచి అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రానికి వెళ్లే ఏకైక సముద్ర ద్వారం. అందుకే.. హోర్ముజ్ మూసివేత అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా బందీగా పెట్టగలదు అని చూపించే అత్యంత శక్తివంతమైన లీవర్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తన 76వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
ఈ తరహా వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. దీని ఫలితంగానే ప్రాజెక్ట్‌కు ప్రాజెక్ట్ పునర్విక రూపుదిద్దుకుంది.
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయలుదేరిన ఫ్లై91 విమానానికి ఆదివారం ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి.
చంద్రబాబు పక్కనే నిలబడి విధులు నిర్వహిస్తున్న ఒక ఎన్ఎస్‌జీ కమాండోకు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. అప్రమత్తమైన ఇతర సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93, కూపర్ కానొలీ 46 బంతుల్లో 87 పరుగులు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. వీరి మెరపు బ్యాటింగ్ తో పంజాబ్ ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.