Publish Date:Jul 16, 2022
సోమవారం (జులై 18) నుంచి పార్లమంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి పార్లమెంటు సమావేశాలలో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు మరో స్థాయిలో ఉంటాయని తెరాస వర్గాలు చెబుతున్నాయి. గతంలోలా రాష్ట్ర్ర సమస్యలపై ఒంటరిగా పార్లమెంటులోనూ, పార్లమెంటు ఆవరణలోనూ నిరసనలు తెలపడం, వాకౌట్ చేయడంతో సరిపుచ్చేయకుండా.. బీజేపీయేతర సభ్యుల మద్దతుతో తమ గొంతు బలంగా వినిపించాలని టీఆర్ఎస్ ఎంపీలు భావిస్తున్నారు.
తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ దిశగానే వారికి దిశా నిర్దేశం చేశారు. గతంలోలా నిరసన గళం వినిపించి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోతే దేశ వ్యాప్తంగా తెరాస వాణి వినిపించే అవకాశాన్ని కోల్పోయినట్లే అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా దేశం దృష్టిని ఆకర్షించేలా తెరాస సభ్యుల నిరసనలు ఉండాలని ఆయన భావిస్తున్నారు.
ఇందుకు బీజేపీయేతర పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీయేతర పార్టీల నేతలతో ఫోన్ లో సంభాషించారు. పార్లమెంట్‌లో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ గట్టిగా గళమెత్తాలనీ సస్పెన్షన్ వేటు వేసినా వెనుకడుగు వేయవద్దని కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్థిని ఓర్వలేకే కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నదనీ, కేంద్రం తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనీ పార్లమెంటు వేదికగా దేశం మొత్తం తెలిసేనా టీఆర్ఎస్ సభ్యులు గళమెత్తాలని కేసీఆర్ ఎంపీలకు చెప్పారు.
తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చింది ఎంత? కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని వంటి అంశాలను గణాంకాలతో సహా పార్లమెంటులో వినిపించాలని కేసీఆర్ వారిని ఆదేశించారు. ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై పోరాడాలని ఈ విషయంలో తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిలవాలని ఆయన బీజేపీయేతర పక్షాల నేతలను కోరారు. ఇందు కోసం ఆయన విపక్ష నేతలతో శుక్రవారమే ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, ఇతర జాతీయ విపక్ష నేతలతో చర్చలు జరిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆస్పత్రిలో ఉన్నందున ఆయన సన్నిహితులతో మాట్లాడారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-to-fight-against-center-in-parliament-25-139916.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.