తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్! ! వైఎస్సారే ఎందుకు టార్గెట్ ?

Publish Date:Jun 25, 2021

Advertisement

కృష్ణా జలాల వివాదం, రాజకీయ వివాదంగా మారుతోంది. ఉభయ తెలుగు రాష్రాల మది మరోమారు చిచ్చుపెట్టేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి వెంట ఒకరుగా తెలంగాణ మంత్రులు, ఆంధ్ర పాలకుల మీద ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు  ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్’గా చాలా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తునారు. గతాన్ని గుర్తు చేసి మరీ అలానాటి ఆంధ్రా పాలకులను దొంగలు, గజ దొంగలు, రాక్షసులు అంటూ విమర్శల తూటాలు పేలుస్తున్నారు.  రెండు మూడు రోజుల క్రితం, వైఎస్ దొంగ, జగన్ గజ దొంగ అంటూ రెచ్చిపోయి తూటాలు పేల్చిన మంత్రి వేముల ప్రశాంత రెడ్డి బాటలోనే మరో మంత్రి శ్రీనివాస గౌడ్  శుక్రవారం తెలంగాణకు అడ్డుపడిన రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికీ రాక్షసుడేనని, కుండబద్దలు కొట్టారు.  

అంతే కాదు,  శ్రీనివాస్ మరోఅడుగు ముందుకేసి, అవును వైఎస్  దొంగ మాత్రమే కాదు, నరరూప రాక్షసుడు అంటూ భగ్గుమన్నారు. తెలంగాణ నీటిని దొంగతనంగా తీసుకుపోతుంటే దొంగ అనక ఏమంటారని,మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన కొడుకు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారని మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. పీజేఆర్ మరణానికి వైఎస్సార్ కారణమని, సంచలన విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను జైలుకి పంపిన తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్‌ అని మంత్రి మండిపడ్డారు. 

తెలంగాణ నేతల విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ..  వైఎస్ విగ్రహాలు తెలంగాణలోని ప్రతిజిల్లాలో పెట్టుకున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర అన్నట్లు ఏపీ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి  ఢిల్లీలో  ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వెనుకబాటు తనానికి, పాలమూరు ప్రజలు వలస పోవడానికి కూడా వైఎస్సారే కారణమని చెప్పారు. పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుపోయి.. పాలమూరు జిల్లా ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుర్మార్గుడు వైఎస్సార్ అని మండిపడ్డారు.శ్రీనివాస గౌడ్ ఏపీ సీఎం జగన్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు.  ఆయన్నుఊసరవేల్లితో పోల్చడమే  కాకుండా, తండ్రికి భిన్నంగా, జగన్ ఉభయ తెలుగు రాష్ట్రాలను ఒకటిగా చూస్తారని అనుకున్నా, ఆయన మాత్రం తండ్రి వైఎస్సార్ దుర్మార్గపు అడుగుజాడల్లోనే  నడుస్తున్నారని మండిపడ్డారు. 

అయితే, ఒక్కసారిగా తెలంగాణ మంత్రులు కృష్ణా జలాల తాజా వివాదాన్ని, అడ్డు పెట్టుకుని ఇంతగా రెచ్చిపోవడానికి జలవివాదమే కాణమా లేక  ఇంకేదైనా కారణం వుందా అంటే, హుజురాబాద్ ఉపఎన్నికలలో సెంటిమెంట్’ను పండించడం కోసమే, తెరాస మంత్రులు వైఎస్సార్, జగన్ రెడ్డి టార్గెట్’గా విమర్శలు చేస్తున్నారని ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు వైసీపీ నాయకులు అంటున్నారు. నిజంగా కూడా, ఇంతవరాకు జరిగిన  ఉపఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నికకు చాలా తేడా ఉందని, ఒకవిధంగా  ఇది  ఉద్యమ స్పూర్తికి ఉద్యమ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య పోరుగా భావిస్తున్న నేపధ్యంలో ఈ ఉఅప ఎన్నిక అత్యత కీలకం కానుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

వైఎస్ టార్గెట్ గా చేస్తున్న విమర్శలు, తెలంగాణలో పార్టీ రాజన్న రాజ్యం తెస్తానని, సందడి చేస్తున్న వైఎస్ షర్మిలకు మింగుడు పడడం లేదు. కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఆమె, అటూ ఇటూ కాని సందిగ్దావస్థను ఎదుర్కుంటున్నారు. అందుకే, ప్రతి విషయంలోనూ స్పందించే షర్మిల తాజా జల వివాదం విషయంలో మౌనంగా ఉండి పోయారని, ఆమెతో కలిసి నడుస్తున్న నేతలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. గతంలో, జలవాదాలు విషయంలో, రాజీపడే ప్రశ్నే లేదని,  అవసరం అయితే  జగనన్నతో అయినా ఫైట్ కు సిద్దమని ప్రకటించిన ఆమె ఇప్పుడుఇలా ‘యు’ టర్న్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కృష్ణా జలాల వివాదం రాజకీయ మంటలు రగల్చడంతో పాటుగా మళ్ళీ మరోమారు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.