ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క

Publish Date:Jun 27, 2021

Advertisement

ఇప్పటిదాకా ఒక లెక్క... ఇప్పటి నుంచి ఓ లెక్క... ఆడొచ్చాడు.. రేవంత్ రెడ్డి వచ్చాడని చెప్పు... అంటూ రేవంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియో హోరెత్తిస్తున్నారు. నిజంగానే తెలంగాణ రాజకీయాలు ఇక నుంచి మరో లెక్కలో వెళతాయనడంలో డౌటే లేదు. ఇప్పటిదాకా.. మంచాన్ని నాలుగు వైపుల నుంచి లాగినట్లే లాగారు కాంగ్రెస్ నేతలు.. ఎవరూ ముందుకు వెళ్లకుండా..వెనక్కు లాగుతూనే ఉన్నారు. ఎవరికి వారు తామే కింగులమంటూ రెచ్చిపోవడం కాంగ్రెస్ లో అలవాటు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైములో చెరిగిపోయింది.  ఆయనే రాజు ఆయనే మంత్రిలా వ్యవహారం నడిచింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో అలాంటి నాయకత్వం అందించడం బహుశా రేవంత్ రెడ్డికే సాధ్యం. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో వన్ సైడ్ డ్రైవింగ్ నడవబోతుందనే చెప్పాలి.  రేవంత్ రెడ్డి దూకుడు, ఆయనకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్..ముఖ్యంగా కేసీఆర్ శత్రువుల్లో ఆయన పట్ల ఉన్న క్రేజ్..ఇవన్నీ.. ఓ రేంజ్ లీడర్ షిప్ అందించే దిశగా వెళతాయనే ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఒక దశలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ఇక బిజెపియే ప్రతిపక్షం..కేసీఆర్ ని ఢీకొట్టేది ఇక బిజెపియే అంటూ టాక్ మార్మోగింది. దుబ్బాక ఎన్నికతో ఆ టాక్ మరింత చెలరేగిపోయింది.  గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన ఓట్లతో బిజెపి ఇక రాబోయే అధికారం వారిదేనని ఫిక్స్ అయిపోయింది. కాని తర్వాత కేసీఆర్ వేసిన ఒకే ఒక పాచికతో అవన్నీ కొట్టేసినట్లు అయిపోయింది.  ఢిల్లీలో కేసీఆర్ దోస్తీ ఉందనే వార్తలు రావడంతో.. రాష్ట్రంలో బిజెపి నేతలు కమెడియన్స్ అయినంత పని అయింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికతో అదే ప్రూవ్ అయింది. ఇప్పుడు హూజురాబాద్ తో మళ్లీ జూలు విదిల్చాలని చూస్తున్నారు. ఈ టైమ్ లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎంట్రీ ఇవ్వడం నిజంగా బిజెపికి గట్టి స్ట్రోకే. అయితే హూజురాబాద్ ఈటల రాజేందర్ బొమ్మతో నడుస్తుంది కాబట్టి.. అక్కడ ఫలితాలు వేరేగా ఉంటాయి.

కాని ఇక నుంచి తెలంగాణ కాంగ్రెస్ మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దుమ్ము రేపుతుందని...ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని ఆపటానికి ప్రయత్నించిన వారంతా ఇక నుంచి ఏం చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీహెచ్ లాంటి నేతలతో సమస్య లేదు..ఎందుకంటే సీనియారిటీ ఉన్నా మాస్ మద్దతు లేదు. శ్రీధర్ బాబు పరిస్దితి కూడా అంతే. ఎటొచ్చీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్గొండ జిల్లా మొత్తం ప్రభావం చూపించగలిగిన వాడు. పైగా రేవంత్ తో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడినవాడు. కాబట్టి సహకరిస్తాడా..లేక నల్గొండ వరకు చూసుకుంటాడా అనేది కూడా చూడాలి. పైగా రేవంత్ తనకు నచ్చినవారిని నేతలుగా రంగంలోకి దింపాలనుకుంటే..ఆ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడటం ఖాయమే. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటూ బిజెపిలోకి వెళ్లిపోవడం కూడా అంతే ఖాయం. ఇప్పటివరకు అన్నకు పదవి వస్తుందేమోనని  ఆగిన రాజగోపాల్ రెడ్డి ఇక ఆలస్యం చేయకుండా బిజెపిలోకి వెళ్లిపోతారనే చెబుతున్నారు. అయితే అసంతృప్తిగా ఉండే నాయకుల్లో కొందరిని కేసీఆర్ మేనేజ్ చేసి..కాంగ్రెస్ లో నే కుంపటి రగిలేలా చేసే అవకాశం అయితే ఉంది. దానిని రేవంత్ రెడ్డి ఎలాఎదుర్కొంటారనేదే చూడాలిక.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.