కొడంగల్ కు బైబై.. రేవంత్ రెడ్డి పోటీ చేయబోయేది ఇక్కడే? 

Publish Date:Jun 30, 2021

Advertisement

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా ఎంపికైన ఎంపీ రేవంత్ రెడ్డి.. తనదైన మార్క్ చూపిస్తున్నారు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ లీడర్ గా పిలుచుకునే రేవంత్ రెడ్డి.. పీసీసీ పగ్గాలు వచ్చాక కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. సంచలన ఆరోపణలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ కాక రేపుతున్నారు. పీసీసీ చీఫ్ గా ఏఐసీసీ నుంచి ప్రకటన వచ్చిన కాసేపటికే ఈటల బీజేపీలో చేరికపై సంచలన ఆరోపణలు చేసి బంబా పేల్చారు రేవంత్ రెడ్డి. తర్వాత రోజు కేటీఆర్, కేసీఆర్ ను టార్గెట్ చేశారు. మంగళవారం గులాబీ లీడర్లతో పాటు కమలం నేతలను కడిగిపారేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రకటించడంతో జోష్ మీదున్న కాంగ్రెస్ కేడర్.. ఆయన స్పీడ్ చూసి మరింత ఉత్సాహంగా కదులుతున్నారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి... రాజకీయంగా ఎదిగింది మాత్రం కొడంగల్. రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే అందరికి వినిపించేది కూడా కొడంగలే. అక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం ఆయన కొడంగల్ నుంచి అనూహ్యంగా ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలో మల్కాజ్ గిరి బరిలో నిలిచి విజయం సాధించి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. అయితే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు చర్చగా మారింది. తనకు గుర్తింపు తెచ్చిన కొడంగల్ నుంచే పోటీ చేస్తారా లేక మరో స్థానానికి మారుతారా అన్న చర్చ జరుగుతోంది. 

గత రెండేండ్లుగా రేవంత్ రెడ్డి రాజకీయ కదలికలు, ఆయన ముఖ్య అనచురుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఈసారి.. కొడంగల్ కాకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని సమాచారం. మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ అసెంబ్లీకి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ పై ఆయన ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. బీజేపీకి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినా... రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. రేవంత్ వల్లే విజయం దక్కిందని చెబుతున్నారు. లింగోజిగూజ కార్పొరేటర్ ప్రమాణస్వీకరానికి జీహెచ్ ఎంసీ కార్యాలయానికి కూడా వెళ్లారు.గత లోక్ సభ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డికి ఎల్బీనగర్ లో భారీ మెజార్టీ వచ్చింది. అప్పటి నుంచే ఎల్బీ నగర్ అసెంబ్లీపై ఆయన ఫోకస్ చేశారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువ ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి. 

జీహెచ్ఎంసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. చాలాసార్లు సుదీర్ రెడ్డి పేరు చెబుతూ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి... ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేగా ఉన్న సుదీర్ రెడ్డిని టార్గెట్ చేశారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎంచుకోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. వందలాది కాలనీలకు రెడ్లే అధ్యక్షులు, చైర్మన్లుగా ఉన్నారు. ఎంపీగా రేవంత్ గెలవాడనికి వీళ్లంతా సాయం చేశారు. రేవంత్ ను అసెంబ్లీకి పోటీ చేయాలని వీళ్లంతా కోరుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎల్బీ నగర్ పరిధిలో ఎక్కువగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల జనాలతో పాటు సెటిలర్లు భారీగానే ఉన్నారు. నల్గొండ, పాలమూరు ప్రజల మద్దతు రేవంత్ రెడ్డికి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సెటిలర్లు మొదటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు. ఇవన్ని కలిసివచ్చే అవకాశాలు ఉండటం వల్లే ఎల్బీనగర్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఎల్బీనగర్ లో రేవంత్ పోటీ చేస్తే.. ఆయనకు కనీస పోటీ ఉండకపోవచ్చనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది..  

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.