పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన అనంతరం జరిగిన పరిణామాలతో ఒక్క సారిగా హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేస్తుందన్న చర్చ ప్రారంభమైంది. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ పట్ల చిన్న చూపుతో వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అయ్యాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భేటీ అయిన తరువాత పరిస్థితిలో ఒకింత మార్పు వచ్చినప్పటికీ.. పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతుందన్న చర్చ మాత్రం ఆగలేదు.
ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ ను తెలుగు సినీ పరిశ్రమకు హబ్ గా మారింది. అలా మారడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివస్తే... ఆయన నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయన్న భావన అందరిలోనూ నెలకొని ఉంది. అంతే కాకుండా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు, అలాగే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ స్వయంగా చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తి. మెగా పవర్ స్టార్ గా ఆయనకు ప్రేక్షకులలో తిరుగులేని ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సిని పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడానికే మొగ్గు చూపుతుందని పరిశీలకులు సైతం విశ్లేషించారు.
అయితే పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని చంద్రబాబు కోరుకోవడం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమపై కూడా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలిరావడంపై తాను పెద్దగా దృష్టి పెట్టడం లేదని అన్నారు. అమరావతి నిర్మాణం పూర్తైతే షూటింగుల కోసం వారే ఇక్కడకు వస్తారని ఆయన చెప్పారు.
అయితే రాష్ట్రాలుగా విడిపోయినా, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రయోజనాలే తనకు ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. అయినా హైదరాబాద్ లో తెలుగు పరిశ్రమ వేళ్లూనుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను చేసిన కృషి కూడా ఒక కారణమన్న ఆయన తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు.. ఏ పరిశ్రమ అయినా ఒక రాష్ట్రం నుంచి తీసేసి మరో రాష్ట్రానికి తరలించడం అనేది అంత తేలిక కాదన్న చంద్రబాబు నాయుడుఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చాలా కాలం పడుతుందని, వాటిని కల్పించిన తరువాతే పరిశ్రమను ఏపీకి ఆహ్వానించడంపై ఆలోచిస్తాననీ, ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశం లేదని విస్పష్టంగా చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tollywood-moove-to-ap-not-now-39-190652.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.