జగన్ సర్కార్’కు టాలీవుడ్ ... బిగ్ శాల్యూట్

Publish Date:Jun 17, 2022

Advertisement

తెలుగు చిత్ర సీమకు,రాజకీయ చుట్టరికం కొత్త విషయం కాదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’ లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే, చాలా మంది  నటీ నటులు, రాజకీయ అరంగేట్రం చేశారు. పాత తరం హీరో కంమ్ విలన్  కొంగర జగ్గయ్య మొదలు నట శేఖర కృష వరకు కాంగ్రెస్ టికెట్ మీద పోటీచేసి పార్లమెంట్’ లో అడుగు పెట్టారు. అలాగే హీరోయిన్లలో జమున కూడా కాంగ్రెస్ ఎంపీగా లోక్ సభకు ఎన్నికయ్యారు. అలాగే, వాణిశ్రీ, వంటి ఇంకొందరు  ప్రముఖ నటీనటులు చట్టసభల్లో కాలు పెట్టక పోయినా కాంగ్రెస్ పార్టీలో, అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలలో క్రియాశీలక పాత్రను పోషించారు. ఎర్ర సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచినా మాదాల రంగా రావు,  కమ్యూనిస్ట్ రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించారు.  అలాగే అల్లు రామలింగయ్య చివరి వరకు, సిపిఎం పార్టీకి ప్రతి సంవత్సరం ‘సెస్’ ( చందా)  ఇచ్చేవారని అంటారు. 

ఇక, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, అన్న ఎన్టీ రామ రావు స్థాపించిన తెలుగు దేశం హయాంలో అయితే చెప్పనే అక్కరలేదు. ఆది సినిమా రాజకీయ అనుబంధానికి స్వర్ణ యుగం అని చెప్పవచ్చును. ఆ కాలంలో  ఎందరో నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఒకరని కాదు 24 ఫ్రేమ్స్  కు చెందిన అనేక మంది సినిమా ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలలో క్రియాశీల భూమికను పోషించారు. తెలుగు దేశం టికెట్ పైన, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. బాబూ మోహన్ వంటి ఒకరిద్దరు మంత్రులుగానూ ఓ వెలుగు వెలిగారు.

నిర్మాత రామానాయుడు, నటీ నటులు నందమూరి బాల కృష్ణ, హరికృష,  మురళీ మోహన్, సత్యనారాయణ, రావు గోపాల రావు, బాబు మోహన్, కోట శ్రినివాస రావు, శారద, జయ ప్రద, జయ సుధ, కే . రోజా, ఇంకా అనేక  మంది తెలుగు దేశం పార్టీ వేదిక నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీలు మారినా ఇప్పటికీ కొందరు క్రియాశీలంగా, కీలక పదవుల్లో ఉన్నారు.  అలాగే రెబెల్ స్టార్ క్రిషన్ రాజ, కోట శ్రీనివాస రావు, నరేష్ వంటి చాలా మంది నటీనటులు బీజేపీలో క్రియాశీలంగా వ్యవహరించారు. కృష్ణం రాజు అయితే, వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మత్రిగా పనిచేశారు. 

అదే విధంగా  మెగా స్టార్  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారానూ కొందరు, నటీ నటులు సినీ ప్రముఖులు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. అయితే, చిరంజీవి అతి తక్కువ కాలంలోనే ప్రజారాజ్యం దుకాణం మూసి వేయడం వల్లనో ఏమో తమ్ముడు, పవన్ కళ్యాణ్. పోసాని కృష్ణ మురళీ తప్పించి పెద్దగా సినిమా వాళ్ళు చిరంజీవితో చేయి కలపలేదు. కలిసి నడవలేదు. చివరకు తమ్ముడు పవన్ కళ్యాణ్’ కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించి,వేరు కుంపటి(జనసేన) పెట్టుకున్నారు. 
ఇక ప్రస్తుతానికి వస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో  సినిమా వాళ్ళకు పొలిటికల్ ప్యాట్రనేజ్ పెద్దగా దక్కడం లేదు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా వాళ్ళను కూరలో కరివేపాకులా వాడుకుని  వదిలేస్తున్నారు. అంతే కానీ, వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషించిన విజయ శాంతి మొదలు నిన్నమొన్న ఇట్లా దగ్గర చేసి అట్లా పక్కన  పెట్టిన ప్రకాష్ రాజ్ వరకు  ఎవరికీ కాసింత గౌరవం ఇచ్చింది లేదు. అందరి విషయంలోలానే సినిమా వాళ్ళ విషయంలోనూ కేసీఆర్, యూజ్ అండ్ త్రో’ పద్ధతినే పాటించారని  అంటారు. 

ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. నిజానికి, సినిమా హీరోలను జీరోలుగా చేసిన, ‘ఘనత’ జగన్ రెడ్డికే దక్కింది. సినిమా టికెట్ ధరల చుట్టూ వివాదాన్ని సృష్టించి, వివాదం పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానం  సినిమా రంగం పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది. అదే విధంగా రాజకీయ పదవుల విషయంలోనూ జగన్ రెడ్డి, చిరంజీవి మొదలు అలీ వరకు, మోహన్ బాబు  మొదలు పోసాని కృష్ణ మురళీ, వరకు ప్రతి ఒక్కరితో ఒకే విధంగా ఆడుకున్నారనే టాక్  టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అందుకే, ఇంతవరకు ఏవో ఆశలతో, వైసీపే కండువా కప్పుకుని, జగన్ రెడ్డిని నెత్తిన మోసిన, పెద్దల ఆశలు మంచులా కరిగి పోయాయని, ఇంకొందరేమో, జగన్ రెడ్డి ని మోసి నందువలన తమకు దక్కింది ఏమీ లేక పోగా సినిమాల్లోనూ అవకశాలు రావడం లేదని అ వాపోతున్నారు.

అందుకే జగనన్నా నీకో దండం అంటున్నారు.  అదలా ఉంటే  రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్దికి అవకాశాలున్నా, సినిమా  రంగం అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చిన్న చూపని, అర్థమయింది కాబట్టే, స్టుడియోల నిర్మాణానికి ఫ్రీ ల్యాండ్ సహా ఇతర సదుపాయాలు కలిపిస్తామని చెప్పినా, ఎవరూ ముందుకు రావడం లేదని, అంటున్నారు.

By
en-us Political News

  
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.