స్టేజ్‌పై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మంత్రి ఆనం..!
Publish Date:Aug 15, 2026
Advertisement
స్వాతంత్ర్య వేడుకల్లో రామనారాయణరెడ్డి అస్వస్థత..! తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. స్టేజ్‌పై ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి ఆనం ఒక్కసారిగా కుప్పకూలి పక్కకు వాలిపోయారు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయనను పట్టుకుని కిందపడకుండా భద్రతా సిబ్బంది, అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు గంటకు పైగా స్టేజ్‌పై నిల్చొని మాట్లాడటంతో బీపీ డౌన్ కావడం వల్లే మంత్రి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అధికారుల అప్రమత్తతతో మంత్రి ఆనంకు ప్రమాదం తప్పింది. Tirupati, Anam Ramanarayana Reddy, Minister Anam, Anam Unwell, Independence Day Celebrations, 80th Independence Day, Tirupati Police Parade Ground, Minister Collapses, BP Drop, Security Personnel, Tirupati Breaking News, Andhra Pradesh, AP News, Independence Day 2026
http://www.teluguone.com/news/content/tirupati-36-228978.html





