తిరుమలలో కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

Publish Date:Oct 3, 2025

Advertisement

 

వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌ సవారి ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. 

పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.

అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. 

తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.

అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల  చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఇతర ఆలయ అధికారులు, శ్రీ‌వారి భక్తులు పాల్గొన్నారు.
 

By
en-us Political News

  
బెంగళూరు నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అతలాకుతలం చేసింది.
ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
చిత్రవిచిత్రమైన కేసులు, క్లయింట్ల మొండి వైఖరితో న్యాయమూర్తులు ఎంతవరకు విసుగుచెందుతారో చూపించే ఆసక్తికర సంఘటన ఇది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది.
కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే నేను ఈ స్థాయికి చేరుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఓటర్ల ఉత్సాహంతో ఊగిపోయింది
ఏపీ సీఎస్ జి. సాయిప్రసాద్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేస్తూ హల్‌చల్ సృష్టించిన సూడో పోలీసును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
సీఎం రేవంత్‌ను కలిసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.