ఆ ముగ్గురూ మారలేదు! జగన్ దారి వీడలేదు!

Publish Date:Sep 30, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఓ ముగ్గురు నాయకులు ఉన్నారు. వారు పేరుకే బీజేపీ కానీ పని చేసేది మాత్రం జగన్ కోసం. ఔను నిజమే ఈ ముగ్గురూ బీజేపీయులే. కారణాలేమైతేనేం.. 2004 నుంచి 2019 వరకూ వారి తీరును అన్ని విధాలుగా అభినందించి ప్రోత్సహించింది బీజేపీ హైకమాండ్. ఈ ముగ్గురి తీరు వల్లా అప్పట్లో బీజేపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఢిల్లీ దాకా పాకి పంచాయతీలు కూడా జరిగాయి. అయినా అధిష్ఠానం అండదండలూ, ప్రోత్సాహం, ఆశీర్వాదం ఉన్న ఆ ముగ్గురు నేతలపైనా అప్పట్లో ఈగ కూడా వాలలేదు. అయితే కాలం ఎల్ల వేళలా ఒకేలా ఉండదు కదా.. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు పొడిచింది. వైసీపీ విషయంలో బీజేపీ తీరు మారింది. అయినా ఈ ముగ్గురూ మాత్రం మారలేదు. ఆర్నెళ్లు సావాసం చేస్తేనే వారు వీరౌతారంటారు. అలాంటిది ఐదేళ్ల సావాసం మరి. మార్పు రాకుండా ఎలా ఉంటుంది. దీంతో ఆ ముగ్గురు బీజేపీ నేతలకూ హైకమాండ్ జగనే అన్నట్లుగా వారి తీరు మారిపోయింది. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది ఆ ముగ్గురూ ఎవరూ. వాళ్లు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి. ఔను ఆ ముగ్గురి గురించే ఇప్పుుడు మనం చెప్పుకుంటున్నది. 

తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో చాలా కాలం తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు ఉంది. తెలుగుదేశం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, బడ్జెట్ లో నిధుల కేటాయింపు వంటి అంశాలలో కేంద్రంలోని మోడీ సర్కార్ తో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చే వరకూ తెలుగుదేశం, బీజేపీలు మిత్రపక్షాలే. అయినా రాష్ట్రంలో మాత్రం బీజేపీ తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి పార్టీగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శత్రు పార్టీగా వ్యవహరించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ముగ్గురు బీజేపీ మంత్రులు ఉన్నా కూడా ఎందుకో అప్పట్లో బీజేపీ, తెలుగుదేశం మధ్య స్నేహ కుసుమాలు వికసించలేదు. ప్రభుత్వంలో ఉన్నాం అంటూ తెలుగుదేశం విధానాలు, నిర్ణయాలకు సానుకూలంగా స్పందించిన మంత్రులు పార్టీలో ఒంటరులయ్యారు. అది వేరే సంగతి. ఆ సమయంలో రాష్ట్ర బీజేపీలో ఈ ముగ్గురి ప్రభా వెలిగిపోయింది. అందుకు పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులు, అండదండలే కారణమనడంలో సందేహం లేదు.  

అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తరువాత మళ్లీ జగన్ పక్షాన గట్టిగా నోరెత్తేందుకు పార్టీ అధిష్ఠానం తమనే ఎంచుకుంటుందని వీరు భావించారు. కానీ ఎన్నికల తరువాత పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు చంద్రబాబు మద్దతుపైనే  ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో జీవీఎల్, సోము, విష్ణువర్ధన్ రెడ్డిలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా వారిని పరిగణనలోనికి తీసుకునే అవకాశాలు కూడా మృగ్యమయ్యాయి. అయినా ఈ ముగ్గురూ ఇంకా జగన్ పాటే పాడుతున్నారు. లేకపోతే.. దేశాన్ని కుదిపేస్తున్న లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి వాడకం విషయంలో ఈ ముగ్గురూ కనీసం నోరు మెదపడం లేదు.  కేంద్ర మంత్రుల నుంచి స్థానిక బీజేపీ నేతల వరకూ అందరూ లడ్డూ వివాదం విషయంలో జగన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటూ ఈ ముగ్గురూ మాత్రం నోరు కుట్టేసుకుని, కట్టేసుకుని కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వీరు తమ బాస్ జగనే అనుకుంటున్నట్లుగా ఉన్నారు. 

By
en-us Political News

  
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.