కెటీఆర్ మెడకు బిగుస్తోన్న ఫార్ములా ఈ రేస్ ఉచ్చు

Publish Date:Oct 25, 2024

Advertisement

ఫార్ములా ఈ రేస్ కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది . గత బిఆర్ ఎస్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు సేకరించింది . హుస్సేన్ సాగర్ చుట్టూ  ఉన్న నెక్లెస్ రోడ్ లో ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆదాయమే రాకపోగా 55 కోట్ల రూపాయలను నిర్వహణ సంస్థకు ముట్ట జెప్పాల్సి వచ్చింది. ఈ కుంభకోణాన్ని వెలికి తీసింది ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇది ట్రై పార్టీ అగ్రిమెంట్ అని ఆయన వెల్లడించారు.  ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటే రాష్ట్రానికి లాభం ఉండదు . కేవలం నిర్వాహకులకు మాత్రమే ఉంటుంది. అప్పట్లో అధికారంలో ఉన్న కెటీఆర్ ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ . తన బావమరిదికి చెందిన నిర్వహణ సంస్థకే ఫార్ములా ఈ రేస్ ప్రాజెక్ట్ అప్పగించారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేయడానికే ఈ ప్రాజెక్ట్ అని  అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. నిరుడు ఫిబ్రవరి 11న ఒక దఫా ఫార్ములా ఈ రేస్ జరిగింది. ఈ యేడు ఫిబ్రవరి లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దయ్యింది . ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ ను తీవ్రంగా వ్యతిరేకించారు  అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన  ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం అప్పటి మున్సిపల్ మంత్రి కెటీఆర్ కనుసన్నల్లో జరిగింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించారు అరవింద్ కుమార్ ఆఘ మేఘాల మీద నిర్వహణ సంస్థకు 55 కోట్ల రూపాయలు ముట్టజెప్పారు . కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అరవింద్ కుమార్ కు మెమో ఇచ్చింది . కెటీఆర్ ఆదేశాలమేరకే 55 కోట్ల రూపాయలను ఈ ఫార్ములా రేస్ నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.  అవినీతి నిరోధక శాఖ ను విచారణ జరపాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.