మంగళగిరి టిడిపి కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా
Publish Date:Jul 10, 2024
Advertisement
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ ల పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా వాయిదా పడింది.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులని పోలీసుల దర్యాప్తులో తేలింది. కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్‌గా గుర్తించారు. వీరిని న్యాయమూర్తి ముందు హాజరు పరుచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మరో పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/the-verdict-of-the-high-court-in-the-case-of-attack-on-mangalagiri-tdp-office-has-been-adjourned-till-tomorrow-25-180438.html





