భర్త మితిమీరి ప్రేమిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి.. దీని వెనుక అసలు నిజం ఇదే!
Publish Date:Jun 17, 2026
Advertisement
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి. కానీ అంతవరకు అలాంటి అప్యాయత ఏమీ లేని భర్త అకస్మాత్తుగా మితిమీరిన ఆప్యాయతను చూపించడం, అధికంగా శ్రద్ధ చూపడం లేదా అంతకు ముందు ఎన్నడూ లేనంత సన్నిహితంగా ఉండటం వంటివి జరిగితే దాన్ని చాలా సులువుగా కొట్టి పారేయకూడదని అంటున్నారు రిలేషన్ నిపుణులు. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదని, ఇలాంటి మార్పు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. విడాకుల ప్రమాదం.. భార్యాభర్తల బంధం ప్రారంభంలో మితిమీరిన ప్రేమతో ఉండే జంటలకు జీవితంలో తర్వాత విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. పరిశోధకులు 168 జంటలను 13 సంవత్సరాల పాటు అనుసరించి ఈ విషయాన్ని వెలిబుచ్చారు. సంబంధం ప్రారంభంలో మితిమీరిన శృంగారభరితంగా , చాలా ఆనందంగా ప్రవర్తించే వారికి కాలక్రమేణా విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారట. మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదకరం? సంబంధంలో నమ్మకం లేదా కమ్యూనికేషన్ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే మితిమీరిన ఆప్యాయత అని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన తీవ్రమైన ఆప్యాయత ఎక్కువకాలం నిలవదని అంటున్నారు. బంధం ప్రారంబైమనప్పుడు అతి చాలా చాలా మితిమీరి ఉంటే.. ఆ తరువాత ఆ బంధం శూన్యంగా మారే అవకాశం ఉంటుదని అంటున్నారు. మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదం? ప్రతి సంబంధంలోనూ ఒక మధురమైన దశ ఉంటుంది, ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎంతో సన్నిహితంగా ఉంటారు. కానీ కాలక్రమేణా ఈ అనురాగం తగ్గిపోవడం సహజంగా జరుగుతుంది. భార్యాభర్తల బంధం మొదలైనప్పుడే ఎమోషన్ గా ఒకరిమీద మరొకరు ఆధారపడితే సమస్య తలెత్తుతుంది. మొదట్లో ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం క్రమంగా బాధ్యతలు, ఇంటి విషయాల కారణంగా తగ్గినప్పుడు వారి బంధంలో ప్రేమ కనుమరుగైపోయిందని భార్యాభర్తలలో ఎవరో ఒకరు తప్పకుండా ఫీలవుతారు.. ఒక బలమైన సంబంధం కేవలం ఆప్యాయతతో మాత్రమే బిల్డ్ కాదు.. బంధంలో నిజాయితీ, నమ్మకం, ఒకరితో మరొకరు మాట్లాడే తీరు, ఒకరికి ఒకరు సహకరించే విధానం అనేవి బంధం ఎక్కువ కాలం పాటు బలంగా ఉండటానికి పునాది అవుతుంది . భార్యాభర్తల బంధంలో ఆప్యాయతను మితిమీరి ప్రదర్శించడం అనేది, ఆ లోటును భర్తీ చేయడానికి చేసే ప్రయత్నానికి సంకేతం కావచ్చని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. లవ్ బాంబింగ్.. లవ్ బాంబింగ్‌ను ఒక ప్రధాన హెచ్చరిక సంకేతంగా రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి త్వరగా భావోద్వేగపరంగా దగ్గరవ్వాలనే ఆశతో, మొదట తమ భాగస్వామిపై మితిమీరిన ప్రేమను, బహుమతులను, పొగడ్తలను కురిపిస్తారు. ఆ తర్వాత, ఈ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. తరచుగా, భాగస్వామి తమను తామే నిందించుకోవడం మొదలుపెట్టి, సంబంధాన్ని తిరిగి బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, దీని అర్థం మితిమీరిన ప్రేమను చూపించే ప్రతి భాగస్వామి తప్పు అని కాదు. కానీ అతిగా ప్రేమ ఉంటే ఆ తర్వాత ప్రేమ లేకపోవడాన్ని భరించలేక గొడవలు, అపార్థాలకు దారితీస్తుంది. ఇది విడాకుల దాకా కూడా వెళ్లవచ్చు. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/the-hidden-truth-behind-extreme-love-35-223236.html




