ఆ ఆడబిడ్డల గుండెఘోష - వైసీపీకి సెగ

Publish Date:Apr 13, 2024

Advertisement

ఏపీ రాజ‌కీయాల్లో  షర్మిల -సునీత వ్యాఖ్యలు కలకలంగా మారుతున్నాయి. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల తన చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిపైనా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన అన్న జగన్ పైన విరుచుకుపడుతున్నారు. మనిషి పుట్టుక పుట్టి, కడుపుకు అన్నంతినే ఎవరికైనా ఆ మాటలు వింటే హృదయం ద్రవించక మానదు. ఆ వీడియో  చూస్తే ఎవ‌రికైనా గుండె బరువెక్కుతుంది. ఒక ఆడబిడ్డ మండుటెండలో నడిరోడ్డుపైన నిలబడి "నేనూ నాసోదరి ఇద్దరమూ కొంగుచాపి/కొంగుపట్టి మిమ్మల్ని ప్రాధేయపడి మాకు న్యాయంచేయమని అడుగుతున్నాము" అనే మాట సామాన్యమైనదికాదు. రాజకీయాలకు మతాలకు కులాలకు అతీతంగా, మానవత్వం సంస్కారం ఉన్నటువంటి ఏమతస్తులకైనా ఏకులస్తులకైనా ఏప్రాంతంవాళ్లకైనా సరే ఆ ఆడబిడ్డల దృశ్యంచూసి ఆమాటలు వింటే కళ్ళల్లో నీళ్లు రాకమానవు. ఆ ఆడబిడ్డల కన్నీటి చుక్కలు అవతలివాళ్లను దహించకమనవు, ఆ ఆడబిడ్డల గుండెఘోష వాళ్లకు రాజకీయ సామాజిక సజీవసమాధి అవకతప్పదు. ఒక భారతీయ ఆడబిడ్డ జీవితంలో ఎంతగా మనోవేదనకు మోసానికి అణచివేతకు దురహంకారానికి గురైతేగానీ ఇంతగా బయటకొచ్చి, రక్తసంబంధాలను కూడా పక్కకునెట్టి మాట్లాడుతున్నారో మనం అర్థంచేసుకోవచ్చు.

ఇక షర్మిల - సునీత చేస్తున్న వ్యాఖ్యలపైన వైఎస్సార్ సోదరి విమల స్పందించారు. కుటుంబ ఆడ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయ‌స్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని విమల  రాజ‌కీయం చేస్తున్నారు.  తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తానూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నట్లు ఆమె చెబుతున్నారు. 
అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారని చెప్పుకొచ్చారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకని వ్యాఖ్యానించారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే తనకే ఎక్కువ ఇష్టమని ఆమె చెబుతున్నారు.  మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండిని ఓ స‌ల‌హా కూడా ఆమె ఇచ్చారు.

నిజానికి అటు సునీత‌, ఇటు ష‌ర్మిల‌లు వైసీపీకి సెగ పుట్టిస్తున్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. జ‌గ‌న్‌ను ఉతికి ఆరేస్తున్నారు. వివేకా హ‌త్య‌ను ప్ర‌ధాన వ‌స్తువుగా తీసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవి ఎంత‌గా ఉన్నాయంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు.. టీడీపీ, జ‌న‌సేన‌లు కూడా చేయ‌నంత‌గా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ నేరుగా వారిని ఏమీ అన‌లేక‌.. అలాగ‌ని ఉండ‌లేక స‌త‌మ‌తం అవుతున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల కీల‌క‌ద‌శ‌లో జ‌గ‌న్ ఇప్ప‌టికే క‌డ‌ప‌లో ప‌ర్య‌ట‌న‌లు పూర్తి చేసుకున్నారు. మ‌ళ్లీ క‌డ‌ప‌కు వెళ్లే అవ‌కాశం లేదు. కానీ, ఇప్పుడు ష‌ర్మిల‌, సునీత‌లు క‌డ‌ప‌లో ప్ర‌చారం ప్రారంభించారు. అంటే.. వారు లైవ్‌లో ఉండ‌నున్నారు. పైగా ఎన్నిక‌ల‌కు మూడు వారాల ముందు వ‌ర‌కు ష‌ర్మిల క‌డ‌ప‌లోనే ఉండి.. సునీత పూర్తిగా అక్క‌డే తిష్ఠ‌వేసి చేసే ప్ర‌చారం ఎన్నిక‌ల వేళ తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంది.

By
en-us Political News

  
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.