జగన్ పై క్విడ్ ప్రోకో కేసుల విచారణ రేపటికి వాయిదా
Publish Date:Jun 19, 2024
Advertisement
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. జగన్పై నమోదైన క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసుల విచారణ నేడు హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో జరగాల్సి ఉంది. అయితే, న్యాయమూర్తి సెలవులో ఉండడంతో కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి! రాష్ట్ర స్థాయిలోనే కాదు... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన అవినీతి చరిత్ర ఆయనది! ‘క్విడ్ ప్రోకో’ అనే పదాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే! అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2012 మే 27వ తేదీన అరెస్టయ్యారు! అంటే... ఇప్పటికి సరిగ్గా పన్నెండేళ్లు! దాదాపు పదేళ్లుగా ఆయన బెయిలుపైనే ఉన్నారు. ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు! అయితే... ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు! ఇకపై జరగబోయేది మరో ఎత్తు!... అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/the-hearing-of-quid-pro-quo-cases-against-jagan-has-been-adjourned-till-tomorrow-25-178979.html





