వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టులకు భూ కేటాయింపులు గత నెల 25 వ తేదీన సుప్రీం ధర్మాసనం రద్దు చేసిన నేపథ్యంలో జవహార్ హౌసింగ్ సొసైటీ మరో మారు ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ నెల 21 నుంచి క్రిస్మస్ సెలవులు ఉండటంతో కొత్త సంవత్సరంలోనే కోర్టు తెరచుకుంటుంది. కోర్టు తీర్పుపై క్లారిఫికేషన్ లేదా రివ్యూ పిటిషన్ వేయడానికి కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ చట్ట పరిధిలో పని చేయాల్సిన హౌజింగ్ సొసైటీ ఇంతవరకు ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు. తీర్పులో పొందుపరిచినట్లు ముఖ్యమంత్రి విచక్షణకే వదిలేసినప్పటికీ హౌసింగ్ సొసైటీ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి నుంచి నిర్దిష్టమైన హామీ తీసుకోవడంలో కమిటీ పెద్దలు వైఫల్యం చెందారు. కమిటీ సొసైటీ తీరు వెయ్యికుటుంబాలు రోడ్డున పడే విధంగా ఉంది.
రెండు దశాబ్దాల క్రితం వైఎస్ ఆర్ ప్రభుత్వ హాయంలో మార్కెట్ రేటు ప్రకారం పన్నెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట, పేట్ బషీర్ బాద్ గ్రామాల్లో జర్నలిస్ట్ లు భూములు కొనుగోలు చేశారు. ప్రతీ పన్నెండేళ్లకు నదులకు పుష్కరాలు వస్తుంటాయి. 2008 నుంచి ఈ భూములకు మోక్షం దొరకలేదు. స్వంతింటి కల ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లుతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఎప్పుడెప్పుడు సొంత ఇంట్లోకి వెళదామా అని తాపత్రయపడుతుంటారు. అలాంటి ఈ భూములు ఏటికేడు అన్యాక్రాంతం అవుతున్నాయని జర్నలిస్ట్ లు తల్లడిల్లిపోతున్నారు. భవిష్యత్‌లో మా భూములు అంటూ ఒకటుండేదని పిల్లలకు కథలుగా చెప్పాల్సిన దుస్థితి వస్తుందేమోనని తలచుకుంటూ గుండెలు బరువెక్కేలా రోదిస్తున్నారు. ఇంతకీ ఆ భూముల వచ్చిన ముప్పేమిటీ? ఆ జర్నలిస్ట్ ల భూమి ఎక్కడ ఉంది? వారికి వచ్చిన కష్టమేమిటో ఇప్పుడు చూద్దాం.
2008లో వైఎస్ ప్రభుత్వం ఎంఎల్ఏల, ఎంపీలు, ఐఏఎస్ , జడ్జీలతో బాటు జర్నలిస్ట్ లకు భూ కేటాయింపులు జరిపింది. ఈ భూటాయింపుల జీవోపై విబిజె చెలికాని హైకోర్టులో పిల్ వేయడంతో న్యాయవివాదం మొదలైంది. హైదరాబాద్ లో స్వంత స్థలం లేదని అఫిడవిట్ ఇచ్చి స్థలాలు తీసుకోవచ్చని దశాబ్దన్నరక్రితం క్రితం హైకోర్టుతీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం సొసైటీ కమిటీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలి. సభ్యుల ప్రమేయం లేకుండానే సుప్రీంకోర్టు కెక్కింది. బైలాస్ ప్రకారం కమిటీ సర్వ సభ్య సమావేశం ఆమోదంతో సుప్రీం కోర్టు గడపదొక్కాలి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు కెళ్లడం సొసైటీ కమిటీ చేసిన అతి పెద్ద తప్పు అని సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 2017లో సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ ఇంటెరిం ఆర్డర్ ప్రకారం 70 ఎకరాలను డెవలప్ చేసుకోవచ్చు. కానీ సొసైటీ ఆ స్థలాలను స్వాధీనం చేసుకోకపోవడం సొసైటీ చేసిన రెండో తప్పు. 2022 లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తీర్పు ప్రకారం స్థలాలను స్వాధీనం చేసుకోకపోవడం సొసైటీ చేసిన మూడో తప్పు. సోసైటీ చేసిన ఈ మూడు తప్పులే వెయ్యికుటుంబాలు రోడ్డున పడే విధంగా చేశాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ జర్నలిస్ట్ లకు భూములను అప్పగించడంలో విఫలమైంది. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్నజర్నలిస్ట్ ల భూములను పంపిణీ చేస్తామని కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది. కానీ సుప్రీం తీర్పుతో జర్నలిస్ట్ లకు ఒక్కసారిగా పిడుగుపడ్డట్టయ్యింది. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం ప్రాతిపదికన ఆర్థికంగా చితికి పోయిన జర్నలిస్ట్ లను ఎంఎల్ ఏ, ఎంపీలు, ఐఏఎస్ , జడ్జిలతో సమానంగా పరిగణించి భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా తీర్పు ఇవ్వడం శరాఘాతంగా మారింది. రెండు దశాబ్దాలు ఎదురు చూసిన జర్నలిస్ట్ లకు విషాదాన్ని మిగిల్చే పీడకల లాంటిది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-beautiful-homes-of-journalists-an-endless-tragedy-39-189619.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.